
గుంటూరు జిల్లా క్రోసూరు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి స్థానిక వైకాపా నాయకులు రికార్డింగ్ డాన్సులతో హోరెత్తించారు. నిబంధనలు అతిక్రమించి వ్యవసాయం మార్కెట్ యార్టులో వైకాపా నాయకుడు షేక్ గనీ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఇందులో పాల్గొన్న పార్టీ నాయకుల్లో కొందరు డాన్సర్లతో కలిసి చిందులేశారు. రికార్డింగ్ డాన్సులకు వ్యవసాయ మార్కెట్ యార్టును ఉపయోగించడం పై స్థానికులు మండిపడుతున్నారు. విందు వినోదాలు, రికార్డింగ్ డాన్సులతో చిందులేస్తున్నా పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదేంటని ప్రశ్నిస్తున్నారు.