
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గాంధీభవన్ లో ఆయన ఉత్తమ్ కుమార్ నుంచి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. కార్యక్రమంలో సీఎల్సీ నేత భట్టి విక్రమార్క, గీతారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గాంధీభవన్ కు చేరుకున్న ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సందడి చేశారు.