
తిరుమల తిరుపతి దేవస్థానంపై సినీనటి నమిత అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నమిత మీడియాతో మాట్లాడారు. భక్తులకు టీటీడీ సంతృప్తికరమైన దర్శనం కల్పించడం లేదని అన్నారు. టీటీడీలో ప్రస్తుతం పరిపాలన బాగోలేదని తెలిపారు. గతంలో ఉన్న అధికారి నేతృత్వంలో తిరుమలలో పరిపాలన బాగుందని చెప్పుకొచ్చారు. టీటీడీ ఉద్యోగులంతా భయందోళనలో ఉన్నారని నమిత అన్నారు.