
ఏపీ సీఎం జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య ఎలాంటి విద్వేషాలు, మనస్పర్థలు లేవని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాచెల్లెలు మధ్య విభేదాలున్నాయని వదంతులు సృష్టిస్తున్నారన్నారు. జగన్ కు ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు కాదని చెప్పారు. కేసీఆర్ అంటే జగన్ కు మంచి అభిమానం ఉందని నారాయణస్వామి తెలిపారు.