https://oktelugu.com/

రాజ్ కుంద్రా అరెస్ట్ పై స్పందించిన శిల్పాశెట్టి

రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసినప్పటి నుంచి మౌనంగా ఉన్న బాలీవుడ్ నటి, రాజ్ కుంద్రా భార్య శిల్పా శెట్టి ఎట్టకేలకు నోరు మెదిపారు. గత కొద్ది రోజులుగా ఎన్నో ఆరోపణలు, వదంతులు వ్యాప్తి చేస్తున్నారని, ట్రోలింగ్ తో పాటు ప్రశ్నలు సంధిస్తున్నారని ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని ఆమె పేర్కొన్నారు. ఈ వివాదంలోకి తనను లాగుతూ తప్పుడు ప్రచారం చేయవద్దని ఇన్ స్టాగ్రాం పోస్ట్ లో శిల్పా శెట్టి కోరారు. […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 2, 2021 / 02:02 PM IST
    Follow us on

    రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసినప్పటి నుంచి మౌనంగా ఉన్న బాలీవుడ్ నటి, రాజ్ కుంద్రా భార్య శిల్పా శెట్టి ఎట్టకేలకు నోరు మెదిపారు. గత కొద్ది రోజులుగా ఎన్నో ఆరోపణలు, వదంతులు వ్యాప్తి చేస్తున్నారని, ట్రోలింగ్ తో పాటు ప్రశ్నలు సంధిస్తున్నారని ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని ఆమె పేర్కొన్నారు. ఈ వివాదంలోకి తనను లాగుతూ తప్పుడు ప్రచారం చేయవద్దని ఇన్ స్టాగ్రాం పోస్ట్ లో శిల్పా శెట్టి కోరారు. న్యాయవ్యవస్థ పై తనకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు.