https://oktelugu.com/

ప్రధాని మోదీతో కలిసి ఐస్ క్రీమ్ తింటాను.. సింధు

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలిచిన హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సోమవారం వర్చువల్ గా మీడియాతో మాట్లాడింది. కోచ్ పార్క్ తో కలిసి ఆమె ప్రెస్ మీట్ కు వచ్చింది. దేశం తరఫున ఒలింపిక్స్ మెడల్ గెలవడమే గర్వకారణమంటే అందులోనూ వరుసగా రెండో మెడల్ గెలవడం చాలా సంతోషంగా ఉందని సింధు చెప్పింది. బ్రాంజ్ మెడల్ మ్యాచ్ లో చివరి పాయింట్ సాధించిన తర్వాత కొద్దిసేపు నా మెదడు పని చేయలేదు. ఐదు, […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 2, 2021 / 01:53 PM IST
    Follow us on

    టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలిచిన హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సోమవారం వర్చువల్ గా మీడియాతో మాట్లాడింది. కోచ్ పార్క్ తో కలిసి ఆమె ప్రెస్ మీట్ కు వచ్చింది. దేశం తరఫున ఒలింపిక్స్ మెడల్ గెలవడమే గర్వకారణమంటే అందులోనూ వరుసగా రెండో మెడల్ గెలవడం చాలా సంతోషంగా ఉందని సింధు చెప్పింది. బ్రాంజ్ మెడల్ మ్యాచ్ లో చివరి పాయింట్ సాధించిన తర్వాత కొద్దిసేపు నా మెదడు పని చేయలేదు. ఐదు, ఆరు సెకన్ల వరకూ అంతా బ్లాంక్ గా ఉంది. ఆ తర్వాత విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాను అని తెలిపింది. మెడల్ తో తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఐస్ క్రీమ్ తిందామని మోదీ అన్నారు. మరి ఆయనతో కలిసి ఏ ఐస్ క్రీమ్ తింటారని ప్రశ్నించగా.. ఏ ఐస్ క్రీమ్ తింటానో నాకు తెలియదు కానీ కచ్చితంగా తింటాను అని ఆమె చెప్పింది.