https://oktelugu.com/

అగ్ని ప్రమాదం పై హోం మంత్రి ఆరా

విశాఖపట్రం హెచ్ పీసీఎల్ లో అగ్నిప్రమాద ఘటనపై హోం మంత్రి సుచరిత ఆరా తీశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక క్రూడ్ ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్ లో ప్రమాదం జరిగినట్లు హెచ్ పీసీఎల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అప్రమత్తమైన సంస్థ అగ్నిమాపక సిబ్బంది అరగంటలోనే మంటలు అదుపు చేశారని ప్రకటనలో పేర్కొంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 25, 2021 / 06:41 PM IST
    Follow us on

    విశాఖపట్రం హెచ్ పీసీఎల్ లో అగ్నిప్రమాద ఘటనపై హోం మంత్రి సుచరిత ఆరా తీశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక క్రూడ్ ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్ లో ప్రమాదం జరిగినట్లు హెచ్ పీసీఎల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అప్రమత్తమైన సంస్థ అగ్నిమాపక సిబ్బంది అరగంటలోనే మంటలు అదుపు చేశారని ప్రకటనలో పేర్కొంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని తెలిపింది. రిఫైనరీలో ని మిగిలిన కార్యకలాపాలు యథావిధిగా జరుగుతున్నట్లు వెల్లడించింది.