Hero Yash: కేజీఎఫ్ సినిమాతో కన్నడ స్టార్ యష్ పేరు మన దేశం మొత్తం మారుమోగి పోయింది. ఈ సినిమాతోనే యష్ స్టార్ హీరో గా ఎదిగి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించు కున్నాడు. 2018 లో కేజిఎఫ్ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదల తర్వాత యష్ రాఖీ బాయ్ గా భారీ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోల రేంజ్ కి ఎదిగి పోయాడు.
కేజీఎఫ్ సినిమాతోనే యష్ అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కన్నడ లోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీలో కూడా సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ కూడా తీసారు.. కేజీఎఫ్ చాప్టర్-2 ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది.. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాపై ఇంట్రెస్ట్ పెంచుతున్నారు. తాజాగా యష్ ఇంటర్వ్యూలో పాల్గొని ఆయన లైఫ్ లో జరిగిన విషయాలను పంచుకున్నాడు.
Also Read: Katrina Kaif: తల్లిని చేశారు సరే.. మరి సినిమాల మాటేమిటి ?
ఇక యష్ సూపర్ స్టార్ గా మారిన తర్వాత ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది.. ఈయనకు లక్షల మంది ఫ్యాన్స్ అమితంగా ఇష్టపడుతున్నారు. మరి యష్ జీవితంలో జరిగిన సంఘటనలు, ఆయన స్టార్ గా ఎలా మారిపోయాడు.. అనే విషయాల గురించి మనం తెలుసు కుందాం..
యష్ పదవ తరగతి చదువుతున్న రోజుల్లో టీచర్ పెద్ద అయ్యాక ఏమి అవుతావు అని అడిగారట.. అప్పుడు ఈయన నేను హీరో అవుతాను అని చెప్పాడట.. అయితే క్లాస్ లో అందరు ఈయన చెప్పిన విషయానికి నవ్వడంతో యష్ కు చాలా బాధ కలిగిందట.. అప్పుడే అనుకున్నాడట.. ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా కష్టపడి మరీ యాక్టర్ అవ్వాలని.. ఈయన కెజిఎఫ్ లో నటించి స్టార్ గా మారడానికి చాలా కష్ట పడ్డానని తెలిపాడు..
యష్ కర్ణాటక లో 1986 జనవరి 8న జన్మించాడు. యష్ తండ్రి అరుణ్ కుమార్ కర్ణాటక ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ లో డ్రైవర్, తల్లి పుష్ప గృహిణి. ఈ దంపతులకు యష్ జన్మించాడు. ఈయన అసలు పేరు నవీన్ కుమార్ గౌడ..వీరి ఆర్ధిక స్థోమత ఎలా ఉన్న కుల తల్లిదండ్రులు మాత్రం అవేమి తెలియకుండా పెంచారట.. ఇంకా ఈయన చిన్న వయసు నుండే స్కూల్ లో ఏ పోటీ జరిగిన ముందు ఉండేవాడట.. స్టేజ్ మీద కనిపించడానికి తహతహ లాడుతూ ఉండేవాడు..
17 ఏళ్ల వయసు లోనే చదువు మానేద్దామని అనుకుంటే అమ్మానాన్నలు ఒప్పుకోలేదు.. దాంతో నేను నాన్న జేబులో 300 రూపాయలు ఉంటే తీసుకుని పారిపోయి వచ్చానని తెలిపాడు.. బెంగుళూరు పారిపోయాక చేతిలో డబ్బులు అయిపోవడంతో ఇంటికి వెళదాం అనుకున్న కానీ అమ్మానాన్నలు ఏమంటారో అని అలాగే ఉన్నా.. నేను కస్టపడి థియేటర్ బృందంలో జాయిన్ అయ్యాను.. కానీ వాళ్ళు నాతో పనులు చేయించుకున్నారు కానీ పని ఇవ్వలేదు.. అయితే ఒక రోజు ఒక ఆర్టిస్ట్ రాకపోవడంతో నేను నటించా నా నటన అందరికి నచ్చింది.. ఆ తర్వాత నుండి చిన్న చిన్న పాత్రలు ఇచ్చేవారు.. అలా నా నటనతో నన్ను నీరు నిరూపించు కుని టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టా..
మైసూరులో చదువు పూర్తి చేసుకుని నటనపై మక్కువతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. యష్ ముందుగా బుల్లితెర హీరోగా ఎంట్రీ ఇచ్చి టెలివిజన్ లో నంద గోకుల సీరియర్ తో తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత కూడా చాలా సీరియల్స్ లో నటించాడు. 2008 లో వచ్చిన మొగ్గిన మనసు సినిమాతో వెండితెర అరంగేట్రం చేసాడు. ఆ తర్వాత కేజిఎఫ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుని లక్షలాది మంది అభిమానులకు ఫేవరేట్ స్టార్ అయిపోయాడు.
ఈయన భార్య రాధికా.. ఈమె కూడా నటి.. యష్ ఈమె ఇద్దరు కలిసి నటించారు. అలా వీరు ప్రేమలో పడి 8 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు.. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ఇప్పటికి ఈయన నాన్న ఇంకా ఉద్యోగం చేస్తూనే ఉన్నారు.. జాబ్ మానేయమని చెప్పినా కూడా వినరు.. అమ్మ కూడా ఆటోలు, బస్సుల లోనే ఇప్పటికి ప్రయాణం చేస్తుంది.. నేను రామ్ చరణ్ లా ఉంటారు అని హైదరాబాద్ వచ్చిన కొత్తలో అనే వారు.. ఇప్పుడు పెరిగిన గడ్డం తో అలా కనిపించడం లేదు.. ఇక నేను సెట్ లో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడకూండా నెక్స్ట్ సీన్ చూసుకుంటా.. కానీ నాకు యాటిట్యూడ్ ఎక్కువ అని అంటూ ఉంటారు.. ఇలా ఈయన తన లైఫ్ లో ఉన్న ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
Also Read:Ram Charan: చరణ్.. ఈ రోజు ఫైటింగ్, రేపటి నుంచి రొమాన్స్
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Kgf hero yash says interesting things in personal life
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com