KCR- Punjab Farmers: జాతీయ రాజకీయాల్లో అరగేట్రం కోసం దేశవ్యాప్త టూర్‌కు శ్రీకారం చుట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇక్కడి ప్రజల సొమ్మును పంజాబ్ రైతుకుటుంబాలకు పరిహారం చెల్లించేందు వెల్లడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో యాసంగి ధాన్యం రారాస్‌గా మార్చి ఎఫ్‌సీఐకి ఇవ్వడానికి మిల్లర్ల బోనస్ ఇవ్వడానికి డబ్బులు లేవని గగ్గొలు పెట్టిన కేసీఆర్ ధాన్యం కొనుగోలు విషయంలో పెద్ద పోరాటమే చేశారు. ఇప్పుడేమో తెలంగాణ ప్రజల సొమ్మును పంజాబ్ రైతుల కుటుంబాలకు ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
600 మందికి రూ.3 లక్షల చొప్పున..
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో చేపట్టనున్న రైతు ఉద్యమంలో 600 మంది పంజాబ్ రైతులు మరణించారు. వీరికి ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున రూ.18 కోట్లు పరిహారంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పంపిణీ చేయనున్నారు. పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వ సహకారంతో ఈనెల 22న ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేసి.. రైతుల కుటుంబాలను పరామర్శించి కేసీఆర్ ఈ సాయం అందిస్తారు.
Also Read: Pawan Kalyan: బీజేపీపైనే ఏపీ భవిష్యత్ రాజకీయాలు.. పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తాడా?
తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్నవారికేది పరిహారం..
తెలంగాణ ప్రజల సొమ్మును సీఎం కేసీఆర్ పంజాబ్ రైతు కుటుంబాలకు పరిహారంగా ఇవ్వడంపై ప్రస్తుతం విస్తృతంగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఎంతో మంది రైతులు తంటాలు పడుతున్నారని.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలు సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ వారినెవర్నీ కేసీఆర్ పట్టించుకోకుండాం పంజాబ్‌లో చనిపోయిన రైతుల్ని ఆదుకుంటామని బయలుదేరారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. సామాన్య జనంలోనూ ఇదే అంశం చర్చకు వస్తోంది. తెలంగాణ ప్రజలు పన్నులుగా కట్టిన సొమ్ముం ఢిల్లీ రైతు ఉద్యమంలో చనిపోయిన వారికి పరిహారంగా ఇవ్వాల్సిన అవసరం ఏముందన్నది వారి ప్రశ్న. నిజానికి పరిహారం ఇవ్వాలనుకుంటే పంజాబ్ ఇవ్వొచ్చు. అక్కడ ఆప్ ప్రభుత్వం ఉంది . లేకపోతే ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇవ్వొచ్చు ఎందుకంటే ఉద్యమం ఢిల్లీలో జరిగింది. కానీ ఎలాంటి సబంధం లేని తెలంగాణ ప్రభుత్వానికి పరిహారం ఇవ్వాల్సిన పనేంటన్న వాదన వినిపిస్తోంది.
రైతు ఉద్యమానికి ఏనాడు మద్దతు తెలుపని కేసీఆర్..
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు ఢిలీలలో దాదాపు ఏడాదిపాటు ఉద్యమించారు. ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పర్యాయాలు ఢిల్లీ వెళ్లారు. కానీ రైతు ఉద్యమానికి ఆయన ఎన్నడూ మద్దతు తెలుపలేదు. నూతన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు మద్దుతు తెలిపారు. కేసీఆర్ కూడా గతంలో ఈ చట్టాలకు తాము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత కేంద్రంతో పెరిగిన గ్యాప్‌తో చట్టాలను విమర్శించడం మొదలు పెట్టారు. నల్ల చట్టాలు అంటూ, రైతులు ప్రధాని మెడలు వంచారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తాజాగా రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇస్తానంటూ తెలంగాణ ప్రజల సొమ్మును మూటగట్టుకుని వెళ్లాడం చర్చనీయాంశమైంది.
తెలంగాణ అమరులకు ఏదీ పరిహారం?
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులు బాసిన అమర వీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించే విషయంపై మార్గదర్శకాలు రూపొందించాలని, ప్రతిపాదనలు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కుటుంబంలో ఎవరికి ఉద్యోగ అవకాశం కల్పించాలనే విషయాన్ని కుటుంబ సభ్యులకే వదిలిపెట్టాలని, ఒకవేళ కుటుంబంలో ఉద్యోగానికి ఎవరూ అర్హులు లేకున్నా, ప్రభుత్వ ఉద్యోగంపై ఆసక్తి లేకున్నా మరో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఉపాధి చూపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యాపారం చేసుకుంటే అందుకు ఆర్థిక సహకారం అందించాలని, వ్యవసాయ చేసుకుంటామంటే వారికి భూమిని సమకూర్చాలని చెప్పారు. ఇంకా సదరు కుటుంబ సభ్యులు తమ కుటుంబం నిలబడడానికి ఏమి కోరుకుంటారో దానిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాలో ఉన్న అమరవీరుల కుటుంబాల జాబితా ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి సంబంధించి ఏం కావాలనే విషయంపై స్వయంగా దృష్టి పెట్టాలని సూచించారు. ఆర్థిక సాయాన్ని ఏమాత్రం జాప్యం లేకుండా అందించాలని చెప్పారు. ఇందుకు సంబంధించిన డబ్బులు కూడా వెంటనే కలెక్టర్ల వద్ద పెట్టాలని ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. స్వరాష్ట్రం సాధించి ఎనిమిదేళ్లు గడిచినా తెలంగాణ ఉద్యమంలో అమరులైన 1,200 మందిలో 600 మంది కుటుంబాలకు కూడా ఇప్పటికీ పరిహారం అందలేదు.
వ్యక్తిగత మైలేజీ కోసమే..
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్.. తెలంగాణ ప్రజలు పన్నులుగా కట్టిన సొమ్ముతో రాజకీయం చేస్తున్నారని.. అక్కడ మైలేజీ కోసం ప్రజాధనం వాడుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. విపక్ష పార్టీలు అదే విమర్శలు చేస్తున్నారు. రైతు కుటుంబాలను ఆదుకోవడాన్ని ఎవరు తప్పు పట్టరు కానీ.. ముందుగా సొంత రాష్ట్ర రైతుల్ని ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి.
Also Read:Nara Lokesh: రూటు మార్చిన లోకేష్ .. పవన్ స్టైల్, బాలయ్య డైలాగ్స్
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Kcr decision to give rs 18cr to punjab farmers
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com