KTR Tweet: కోరి తిట్టించుకోవడం అనే సామెత మీకు గుర్తుండే ఉంటుంది కదా. అయితే ఇప్పుడు కేటీఆర్ చేసిన పని చివరకు ఆయనమీదే విమర్శలకు దారి తీస్తోంది. అనవసరంగా కామెంట్లు చేసి చివరకు తిట్టించుకున్నారని నిపుణులు అంటు్నారు. మంగళవారం నాగు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో కొత్తగా విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్స్ కొత్త ఫ్యాక్టరీని కేటీఆర్ ప్రారంభించారు. దీన్ని రూ.300 కోట్లతో నిర్మించారు. దీని వల్ల 900మందికి ఉద్యోగాలు రానున్నాయి.
అయితే ఈ కంపెనీ ప్రారంభోత్సవంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో టీఎస్ఐపాస్ ద్వారా పదిహేను రోజుల్లోనే పర్మిషన్ ఇస్తున్నామని, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. అహ్మదాబాద్ కంటే హైదరాబాద్ లోనే ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ వివాదానికి దారి తీసింది.
Also Read: Congress Protest: కాంగ్రెస్ దండు కదిలింది.. ధరలపై యుద్ధం మొదలైంది
ప్రస్తుతం బెంగళూరు కంటే హైదరాబాద్ లోనే ఎక్కువ మౌళిక సదుపాయాలు ఉన్నాయని, కాబట్టి బెంగుళూరులోని వ్యాపారులు హైదరాబాద్కు తరలి రావాలంటే వారిని ఆహ్వానిస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఇంకేముంది ఈ ట్వీట్ మీద స్వయంగా కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై రీట్వీట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కౌంటర్ అనే అనాలి.
బొమ్మై స్పందిస్తూ.. బెంగుళూరుకు ఏటా ప్రపంచ నలుమూలల నుంచి వ్యాపార, వాణిజ్య రంగ ప్రముఖులు పెట్టుబడుల కోసం వస్తుంటారని చెప్పారు. ప్రస్తుతం దేశంలోనే ఎక్కువ స్టార్టప్స్ కంపెనీలు, యూనీకార్న్స్ బెంగళూరులోనే ఉన్నాయంటూ వివరణ ఇచ్చారు. గడిచిన మూడేండ్లలో అత్యధిక FDIలు వస్తున్నాయని, తద్వారా ఆర్థికంగా అధిక ప్రగతి సాధించామంటూ చెప్పుకొచ్చారు.
ఇక కేటీఆర్ ట్వీట్ పై కర్ణాటక బీజేపీ రంగంలోకి దిగి ఫైర్ అయిపోయింది. బెంగుళూరును అనేముందు ఒకసారి హైదరాబాద్ పరిస్థితి ఏంటో చెప్పాలంటూ విమర్శించింది. ప్రస్తుతం తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలుసని, ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఉనికి కోల్పోతుందంటూ విమర్శించారు.
మీరు బెంగళూరుతో పోటీ అనడం హాస్యాస్పదమంటూ చురకలంటించారు కర్ణాటక బీజేపీ నేతలు. విదేశీ పెట్టుబడుల్లో హైదరాబాద్ స్థానం ఏంటో అందరికీ తెలుసంటూ కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు. ఇక కర్నాటక మంత్రి సుధాకర్ ట్వీట్ చేస్తూ.. ప్రస్తుతం బెంగుళూరు సింగపూర్ లాంటి నగరంతో పోటీ పడుతోందని, తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ కూడా అలాగే డెవలప్ అవుతుందంటూ సెటైర్లు పేల్చారు.
దీన్ని చూస్తుంటే.. కేటీఆర్ అనవసరంగా కామెంట్లు చేసి తిట్టించుకున్నారని అనిపిస్తోంది. పొరుగు రాష్ట్రంలో పోటీ భావం ఉండాలి గానీ.. అక్కడి పెట్టుబడులను లాగేసుకోవాలని చూస్తే ఇలాంటి కౌంటర్లే వస్తుంటాయి మరి. పాపం కేటీఆర్ ఏదో అనుకుని ట్వీట్ చేస్తే.. చివరకు ఇలాంటి పరిస్థితి ఎదురైందన్నమాట.
Also Read:Arrest Warrant On MLA Roja Husband: రోజా భర్త సెల్వమణిపై అరెస్ట్ వారెంట్.. ఆ కేసులో అలా చేశారంట
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Karnataka cm bommai responded to ktr tweet
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com