Homeబిజినెస్Quick Commerce: ఇక కిరాణా షాపులు ఉండవు.. సంచలన పరిణామం.. దెబ్బ ఎవరికంటే?

Quick Commerce: ఇక కిరాణా షాపులు ఉండవు.. సంచలన పరిణామం.. దెబ్బ ఎవరికంటే?

Quick Commerce: ఒకప్పుడు ఊరికి ఒక కిరాణా కొట్టు ఉండేది. శావుకారి దగ్గరకు వెళ్లి అవసరం అయిన సరుకులు తెచ్చుకునేవారు. పట్టణాల్లో మాత్రమే కొన్ని షాపులు ఉండేవి. తర్వాత కిరాణా వ్యాపారం విస్తరించింది. గ్రామాల్లో కూడా పది వరకు కిరాణా షాపులు కనిపిస్తున్నాయి. ఇక పట్టణాల్లో అయితే వీధికి ఒకటి, రెండు కిరాణా షాపులు ఉంటున్నాయి. ఈ వ్యాపారంతో లక్షల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. అయితే సూపర్‌ మార్కెట్లు, స్పెన్సర్, డీమార్ట్, హెరిటేజ్‌ లాంటి షాపింగ్‌ మాల్స్‌ రాకతో కిరాణా వ్యాపారంపై ప్రభావం పడింది. చాలా వరకు కిరాణా దుకాణాలు మూతపడ్డాయి. చాలా మంది మాల్స్‌కు వెళ్లడానికి ఆసక్తి చూపుతుండడం, ఆఫర్లు ఇస్తుండడంతో గ్రామీణుల కూడా సమీపంలోని పట్టణాలు, నగరాల్లోని సూపర్‌ మార్కెట్లు, మాల్స్‌కు వెళ్లి ఒకేసారి సరుకులు తెచ్చుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఆన్‌లైన్‌ మార్కెట్‌(ఈ కామర్స్‌) వ్యాపారం విస్తరిస్తోంది. ఇంట్లో ఉండే సరుకులు ఆర్డర్‌ చేస్తున్నారు. సరుకులు ఇంటికే వస్తున్నాయి. దీంతో విధుల్లో బిజీగా ఉండేవారు. షాపింగ్‌ మాల్స్‌కు వెళ్లే తీరిక లేనివారు.. ఇప్పుడు ఆన్‌లైన్‌లో సరుకులు ఆర్డర్‌ చేస్తున్నారు. అమెజాన్, రిలయ్స్, హెరిటేజ్‌తోపాటు అనేక ఈకామర్స్‌ సంస్థలు ఆఫర్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో కిరాణా షాపులు మరింత కుదేలయ్యాయి. షాపింగ్‌ మాల్స్‌పైనా ప్రభావం పడింది.

క్విక్‌ కామర్స్‌…
ఇక ఇప్పుడు క్విక్‌ కామర్స్‌ దూకుడు కనబరుస్తోంది. వేగంగా విస్తరిస్తోంది. దీంతో 2 లక్షల కిరాణా షాపులు మూతపడ్డాయి. ఆర్డర్‌ చేసిన 10 నిమిషాల్లో ఇంటికి సరుకులు వస్తున్నాయి. దీంతో క్విక్‌ కామర్స్‌ సంస్థలకు ఆదరణ పెరుగుతోంది. కొత్తగా వస్తున్న సంస్థలు ఆఫర్స్‌ ఇస్తున్నాయి. దీంతో వినియోగదారులు క్విక్‌కామర్స్‌వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా కిరాణా దుకాణాల్లో అమ్మకాలు బాగా తగ్గిపోయాయి.

రూ.10 వేల కోట్ల విక్రయాలు
క్విక్‌ కామర్స్‌ దూకుడు ఎలా ఉందంటే.. ఒక్క ఏడాదిలోనే కిరాణా దుకాణాల నుంచి రూ.10,700 కోట్ల విక్రయాలు క్విక్‌ కమార్స్‌ చేతికి వెళ్లాయి. ఇక కిరాణా షాపుల్లో కొనుగోళ్లు తగ్గించామని 46 శాతం మంది వినియోగదారులు వెల్లడించారు. తాము క్విక్‌ కామర్స్‌వైపు మళ్లామని పేర్కొన్నారు. ప్రస్తుతం క్విక్‌ మార్కెట్‌లో టాటా సంస్థ బిగ్‌ బాస్కెట్, జొమాటోకు చెందిన బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టిమార్ట్, జెపన్టో, జియో మార్‌ వంటి సంస్థలు ఉన్నాయి. నిమిషాల్లో సరుకులు డెలివరీ చేస్తున్నాయి. క్విక్‌ కామర్స్‌ ఎఫెక్ట్‌తో 67 శాతం విక్రయాలు తగ్గాయని వర్తకులు పేర్కొంటున్నారు. కేవలం 5 శాతం మంది ఇప్పటికీ కిరాణా షాపుల్లోనే కొనుగోళ్లు చేస్తున్నారు.

ఖర్చులు తగ్గాయ్‌..
క్విక్‌ కామర్స్, ఈ కామర్స్‌ సంస్థల కారణంగా విక్రయాలు తగ్గడంతోపాటు వినియోగదారుల వృథా ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. దీంతో చాలా మంది ఈ సంస్థలనే ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా కిరాణా దుకాణాల నిర్వహణ భారం అవుతోంది. డిస్ట్రిబ్యూటర్లను కాపాడుకుంటూ వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్‌లైన్‌ వ్యవస్థలను అందిపుచ్చుకోవడంలో డాబర్, మారికో, హెచ్‌ఏయూఎల్, గోద్రెజ్‌ కన్జూమర్స్‌ ప్రొడక్ట్‌ వంటి సంస్థలక సవాల్‌గా మారింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper