Youth Employment Scheme: భారత ప్రభుత్వం నిరుద్యోగులు, యువత ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించేందుకు అనేక డిజిటల్ వేదికలను అందుబాటులోకి తెచ్చింది. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా అనేక రంగాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో కొన్ని యాప్‌ల ద్వారా నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు, వ్యాపార విస్తరణ వంటి అవకాశాలు కల్పిస్తోంది. అలాంటి వాటిలో మూడు కీలకమైన యాప్‌లు ఉన్నాయి. వీటితో బాగా డబ్బులు సంపాదించొచ్చు.
స్కిల్ ఇండియా డిజిటల్ హబ్..
స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక అద్భుతమైన వేదిక, ఇది యువతకు ఉచిత నైపుణ్య శిక్షణను అందిస్తుంది. ఈ యాప్ ద్వారా ఏఐ, కోడింగ్, ఫైనాన్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి ఆధునిక రంగాల్లో శిక్షణ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అందించే కోర్సులు పూర్తిగా ఉచితం. కోర్సులు పూర్తి చేసన వారికి ప్రభుత్వం గుర్తింపు సర్టిఫికెట్ జారీ చేస్తుంది. ఇది ఉద్యోగావకాశాలకు ఉపయోగపడుతుంది. ఇదే పోర్టల్‌లో కూడా ఉపాధి కల్పిస్తుంది. నెలకు రూ.25 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు వేతనం పొందవచ్చు. నైపుణ్యం, అనుభవం ఆధారంగా వేతనం ఉంటుంది. ఈ యాప్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాన్ని అందిస్తుంది.
Also Read: Satellite Internet: కొండ, మారుమూల ప్రాంతాలకు కూడా త్వరలో సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్
మై గవర్నమెంట్ యాప్..
మై గవర్నమెంట్ యాప్ సాధారణ టాస్క్‌ల నుంచి సృజనాత్మక పోటీల వరకు విస్తృత ఆదాయ అవకాశాలను అందిస్తుంది. అయితే, పోటీలలో గెలవడానికి సృజనాత్మక నైపుణ్యాలు, కొంత పోటీతత్వం అవసరం. ఈ యాప్ పౌరులను ప్రభుత్వ కార్యక్రమాలతో అనుసంధానం చేసే వేదిక. ఇందులో సరళమైన క్విజ్‌లు, సర్వేలు లేదా చిన్న టాస్క్‌లు పూర్తి చేయడం ద్వారా వినియోగదారులు వేల రూపాయలు సంపాదించవచ్చు. ఇవి సాధారణంగా తక్కువ సమయం తీసుకునే పనులు. వీటితోపాటు సృజనాత్మకమైన ఆర్టికల్ రాయడం, ఎస్సే రచన, వీడియో నిర్మాణం వంటి పోటీలలో పాల్గొనడం ద్వారా లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశం ఉంది. ఈ యాప్ సామాన్య పౌరులకు, ముఖ్యంగా విద్యార్థులకు, గృహిణులకు, ఫ్రీలాన్సర్‌లకు అదనపు ఆదాయ మార్గాన్ని అందిస్తుంది.
Also Read: AI Drones Guns: ఏఐ గన్స్ వచ్చేశాయి.. ఇక కశ్మీర్ లో పాక్, చైనాకు దబిడదిబిడే..
జీప్నిక్ (GeM – Government e-Marketplace)యాప్..
జీప్నిక్ యాప్ సేనలు, ఉత్పత్తుల కొనుగోలు కోసం రూపొందించిన డిజిటల్ పోర్టల్. ఇది వ్యాపారులు, ఫ్రీలాన్సర్‌లు, ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వ టెండర్ల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే అవకాశాన్ని అందిస్తుంది. ఈ యాప్‌లో ప్రభుత్వం ఏటా రూ.2 లక్షల కోట్ల విలువైన టెండర్లను అందిస్తుంది. ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఫొటోగ్రఫీ, ఇంటీరియర్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్, ఆర్కిటెక్చర్ వంటి రంగాల్లో టెండర్లు ఎక్కువగా ఉంటాయి. చిన్న, మధ్య తరగతి వ్యాపారాలు తమ ఉత్పత్తులు లేదా సేవలను ప్రభుత్వ సంస్థలకు నేరుగా అందించవచ్చు. ఇది వ్యాపార వృద్ధికి దోహదపడుతుంది. ఈ పోర్టల్ చిన్న వ్యాపారులు, ఫ్రీలాన్సర్‌లకు ప్రభుత్వ ఒప్పందాల ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది. టెండర్ ప్రక్రియ డిజిటల్‌గా జరగడం వల్ల పారదర్శకత కూడా ఎక్కువ.