IT job sector: ఐటీ.. కరోనా సమయం వరకు ప్రతీ సగటు యువకుడి డ్రీమ్. ఐదు అకెంల జీతం.. వారానికి ఐదు రోజులే పని.. అని సగటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఐటీ జాబ్ వస్తే చాలు అనుకునేవారు. కానీ, కోవిడ్ తర్వాత మారిన ఫరిస్థితిలు ఐటీ ఉద్యోగుల జీవితాలను తలకిందులు చేశాయి. ఇక ఇప్పుడు ఏఐ కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. లక్షల మంది ఐటీ ఇంజినీర్లు రోడ్డున పడుతున్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు మంచి జీతం కావడంతో ఇళ్లు, స్థలాలు, ప్లాట్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈఎంఐ కట్టడానికి తంటాలు పడుతున్నారు. ఇందుకు తాజా నిదర్శనం నోయిడాకు చెందిన ఓ ఐటీ నిపుణుడు వీడియో.
కోట్ల పెట్టి ప్లాట్లు కొని..
నోయిడా.. బెంగళూరు, హైదరాబాద్ తర్వాత ఐటీకి అడ్డా. దీంతో ఇక్కడ రియల్ వ్యాపారం జోరుగా సాగింది. ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని రియట్లర్లు భారీ, విలాసవంతంమైన అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ఇళ్లు నిర్మించారు. ఐటీ ఇంజినీర్లు కూడా వాటిని కొనుగోలు చేశారు. అయితే ప్రస్తుత ఐటీరంగ సంక్షోభంతో ప్లాట్లు, ఇళ్లు, విల్లాలు కొనుగోలు చేసినవారు ఉద్యోగాలు కోల్పోయారు. కొందరికి వేతనాల్లో వృద్ధి లేక ఇబ్బంది పడుతున్నారు.
పార్ట్‌టైం పని చేస్తూ..
ఈఎంఐల భారం నిర్వహించుకోడానికి, కొంతమంది ఉద్యోగులు రాపిడో వంటి సైడ్ జాబ్స్ చేపట్టి అదనపు ఆదాయం పొందుతున్నారు. ఇది వారి కుటుంబ పరిస్థితిని నిలబెట్టుకునేందుకు అవకాశం ఇస్తోంది. కొంతమంది ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు కూడా చేస్తున్నారు. ఇక కొందరు ప్లాట్లు అమ్ముకుంటున్నారు. ఇంకొందరు ప్లాట్ అద్దెకు ఇచ్చి.. వీళ్లు చిన్న ఇళ్లలో అద్దెకు ఉంటున్నారు. ఐటీ ఉద్యోగులు మెరుగైన అవకాశాల కోసం ఉద్యోగాలు మార్చాలని ప్రయత్నించగా, హైరింగ్ స్లోడౌన్ కారణం వల్ల ఇందులో ఎదురుదెబ్బలు తిన్నారన్న విషయం వెల్లడైంది.
ఏఐ, ఆర్థిక సంక్షోభాలతోపాటు ఈ పరిస్థితి ఐటీ రంగంలోని ఉద్యోగ నిర్ధారిత్వంపై అడిగి ప్రశ్నల్ని అంతటికీ తీసుకురాగలదు. తగిన మార్పులు, సహాయ చర్యలు అవసరం అని వీరికి బయట నుంచి సలహాలు వస్తున్నాయి.
The reality of the IT job sector right now. pic.twitter.com/dhGhRoPJjY
— Indian Tech & Infra (@IndianTechGuide) November 25, 2025