Pothina Mahesh- Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గురించి జనసేన పార్టీ నేత పోతిని మహేశ్ సంచలన విషయలు బయటపెట్టారు. తీవ్రమైన ఆరోపణలు చేశారు. సజ్జల బ్రోకరిజాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు. దుమ్ముంటే తన ఆరోపణలపై ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడాలని సవాల్ విసిరారు.. దీంతో మహేశ్ ఆరోపణలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
సలహాదారు పేరుతో బ్రోకరిజం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పేరుతో సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు పదవిలో ఉంటూ బ్రోకరిజం చేస్తున్నారని మహేశ్ ఆరోపించారు. సలహాదారు పాత్రలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క సలహా ఇవ్వని సజ్జల కేవలం తన వ్యాపార విస్తరణ కోసమే పదవిని వాడుకుంటున్నారని ఆరోపించారు.
Also Read: Pawan Kalyan Former Look: ఈ లుక్ చాలు పవన్ కళ్యాణ్ ఎంత రైతు పక్షపాతో తెలిస్తుంది!
– సకల శాఖల నుంచి కమీషన్ దండుకునే బ్రోకర్‌గా మాత్రమే సజ్జల పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు ఏ విమర్శ చేసినా, ఏ శాఖపై ఆరోపణ చేసినా సజ్జలనే ప్రెస్‌మీట్ పెట్టడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అన్ని శాఖలనుంచి కమీషన్ దండుకునే సజ్జల అన్ని శాఖల తరఫునా మాట్లాడుతున్నారని విమర్శించారు.
– మంత్రిపదవి ఇప్పిస్తానని ఓ ఎమ్మెల్యేకు బ్రోకర్‌గా వ్యవహరించారు. ఈ విషయం తెలిసి సజ్జలను ఎమ్మెల్యే కుటుంబ సభ్యులే కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
యాంకర్‌కు ఆడి కారు..
ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల ఓ ప్రముఖ యాంకర్‌కు ఇటీవల ఆడీ కారు కొనిచ్చారని మహేశ్ ఆరోపించారు. ఈమేరకు రాష్ట్రం మొత్తం కోడై కూస్తుందని పేర్కొన్నారు. ఆ అవసరం ఏమిటో బయట పెట్టాలి. దానిపై ప్రెస్‌మీట్ ఎందుకు పెట్ట్టరు అని ప్రశ్నించారు.
– ఇసుక, లిక్కర్ దందాలో కోట్ల రూపాయల పర్సంటేజీ సజ్జల రామకృష్ణారెడ్డికి ముడుతున్నాయని మహేశ్ ఆరోపించారు. ఇసుక టెండర్‌ను తనకు అనుకూలమైన సంస్థకు ఇప్పించి కమీషన్ దండుకుంటున్నారని, ఊరు, పేరు లేని బ్రాండ్ల మద్యాన్ని ఆంధ్రా ప్రజలతో తాగిస్తూ లిక్కర్ కంపెనీల నుంచి కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు.
– గుడివాడలో క్యాషినోవా సెంటర్ కేసును పక్కదారి పట్టించేందుకు, నిర్వాహకులకు శిక్ష పడకుండా చేసినందుకు మాజీ మంత్రి కొడాలి నాని నుంచే సజ్జల డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు.
– పోలవరం కాంట్రాక్టు విషయంలోను భారీగా అవినీతి జరిగిందని, దీనికి సజ్జలనే కారకుడని ఆరోపించారు. ఇందులోనూ భారీగా ముడుపులు ముట్టాయని తెలిపారు.
– దమ్ముంటే తాను చేసిన ఆరోపణలపై సజ్జల ప్రెస్‌మీట్ పెట్టి చెప్పాలని డిమాండ్ చేశారు. సజ్జల అవీనీతి బాగోతంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తామని తెలిపారు.
– సినిమా టికెట్లు పేదలకు భారం అవుతాని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధర తగ్గించిందని, ప్రభుత్వ సలహాదారు పాత్రలో సజ్జల ఇప్పుడు పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు తగ్గించాలని ఒక సలహా ఇవ్వాలేరా అని ప్రశ్నించారు.
సలహాదారుగా బ్రోకరిజం చేస్తున్న సజ్జల.. వందల కోట్లు సంపాదిస్తున్నారని, రాష్ట్రానికి, ప్రజల కోసం ఒక్క మేలు కూడా చేయలేదని ఆరోపించారు. త్వరలోనే అవినీతిని సాక్షాదారాలతో బయట పెడతామని తెలిపారు. మరి మహేశ్ ఆరోపణలపై సజ్జల ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read:KCR Meeting With Ministers: సడెన్ గా మంత్రులతో కేసీఆర్ భేటి.. ఈసారి ఏం జరుగుతుందో?
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Janasena leader pothina mahesh fires on sajjala ramakrishna reddy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com