Janasena Compete Alone: ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉంది. అప్పుడే పొత్తులు, ఆ పొత్తుల్లో రాజకీయాలు, ఒకరికొకరు పోటీ ప్రకటనలతో రక్తికట్టిస్తున్నారు. ఒక వైపు పొత్తుల అంశం తెరపైకి తెస్తూనే ఎవరికి వారు యమునా తీరుగా వ్యవహరిస్తున్నారు. లాభ నష్టాలను భేరీజులు వేసుకుంటున్నారు. అయితే పొత్తుల అంశాన్ని వన్ సైట్ లవ్ రూపంలో తెరపైకి తెచ్చిన చంద్రబాబు సైలెంట్ అయ్యారు. తమ పార్టీ వారిని నోరు మూయించారు. ఇక తామెప్పుడూ కలిసే వెళతామని.. గత మూడేళ్లుగా జనసేనతో కలిసే ఉన్నామని ఇన్నాళ్లూ చెప్పుకొచ్చిన బీజేపీ సడెన్ గా రూటు మార్చింది. జనసేనకు దూరంగా జరిగిపోతోంది. దీంతో జనసేన ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇటు టీడీపీ, అటు బీజేపీ పవన్ ను లెక్క చేయడం లేదా? అంటే అవుననే అనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఇప్పుడు రాజకీయాల్లో ఏ పార్టీ లెక్క చేసే పరిస్థిితి లేదు. పటిష్టమైన ఓటు బ్యాంకు లేకుండా, క్షేత్రస్థాయిలో బలం, బలగం లేని జనసేనను కావలించుకుని ఏం చేసుకోవాలన్న స్థితికి పార్టీలు వచ్చాయి. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఎల్లకాలం పనిచేయవని సీనియర్ నేతలు సయితం సూచిస్తున్నారు. పవన్ కల్యాణ్ తన బలం ఏంటో ఒకసారి చూసుకుంటే మంచిదన్న సూచనలు వినపడుతున్నాయి.
హోప్స్ వదులుకున్న బీజేపీ..
బీజేపీకి నాయకులు ఉన్నా ఆ పార్టీ ఏపీలో ఆశించిన స్థాయిలో బలోపేతం కావడం లేదు. పక్కన ఉన్న తెలంగాణతో పోల్చుకుంటే ఇక్కడ మాత్రం ఫలితాలు నిరాశాజనకం. అందుకే పార్టీ అగ్రనేతలకు సైతం ఇది మింగుడు పడడం లేదు. అందుకే ఏపీపై హోప్స్ వదులుకున్నారు. అందుకే పార్టీ బలోపేతం చేయడంపై కూడా ద్రుష్టిపెట్టిన దాఖలాలు లేవు. ఇప్పటికే తెలంగాణలో ఎంపీ, ఎమ్మెల్యేలుండగా..ఏపీలో మాత్రం ఆ పార్టీకి ఒక్క సభ్యుడు కూడా లేరు.కానీ ఇటీవల ప్రకటించిన రాజ్యసభ స్థానాల్లో ఒక్కటంటే ఒక్కటీ ఏపీకి కేటాయించలేదు. తెలంగాణలో లక్ష్మణ్ కు కేటాయించారు. పోనీ గత ఎన్నికల తరువాత ఏపీ తరుపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు.
Also Read: Viagra Overdose: వయాగ్రా ఓవర్ డోస్ తీసుకొని శోభనం గదిలోకి కొత్త పెళ్లికొడుకు.. తర్వాత ఏమైందంటే?
తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టారు. ప్రస్తుతం ఉన్న పొజిషన్ లో ఒంటరిగా పోటీచేసినా, జనసేనతో కలిసినా ఏమంత ప్రయోజనముండదన్న నిర్ణయానికి బీజేపీ హైకమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నడ్డా దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ కూడా చేశారు. కానీ నడ్డా రెండు మీటింగ్ లలో పాల్గొన్నప్పటికీ జనసేన గురించి, పవన్ ప్రస్తావన కాని తేలేదు. అసలు జనసేనతో పొత్తు ఉన్న విషయాన్ని బీజేపీ అగ్రనేతలు మర్చిపోయినట్లు వ్యవహరించడం ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీసింది.జేపీ నడ్డా రెండు రోజుల పర్యటనలో పవన్ ను కనీసం ప్రశంసించలేదు. జనసేన గురించి మాట్లాడకపోవడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని నడ్డా అన్నారే తప్పించి, బీజేపీ, జనసేన అధికారంలోకి వస్తుందని అనకపోవడాన్ని కూడా కొందరు ఈ సందర్భంగా ప్రస్తావనకు తీసుకువస్తున్నారు. బీజేపీ కనీసం తమ అధినేతను పట్టించుకోకపోవడాన్ని వారు సీరియస్ గా తీసుకుంటున్నారు.
వ్యూహాత్మకంగా చంద్రబాబు..
పొత్తులపై ముందుగా ప్రకటన చేసి.. ఆశపెట్టిన చంద్రబాబు కూడా వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. జనసేన డిమాండ్లను సీరియస్ గా తీసుకోవడం లేదు. టీడీపీ తగ్గితే భవిష్యత్ ఉండదని వారికి తెలుసు. కాపు ఓటు బ్యాంకు మినహా (అది కూడా అంత లేదు) పవన్ కు పెద్దగా బలం లేదని టీడీపీ భావిస్తుంది. అందుకే పవన్ ను లైట్ గా తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. తనంతట తానుగా పొత్తుకు వస్తే కొన్ని సీట్లు సర్దుబాటు చేస్తామని, ముఖ్యమంత్రి పదవి అంటే పొత్తు అవసరం లేదని చెప్పాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. మహానాడు తర్వాత టీడీపీ పుంజుకుందని చంద్రబాబు నుంచి నేతలు సయితం అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ప్రత్యమ్నాయంగా చంద్రబాబును ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని చెబుతోంది. అందుకే పవన్ డిమాండ్ ను పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదన్నది వాస్తవం. టీడీపీది అతి విశ్వాసం అని కొందరు అనుకున్నా వారు మాత్రం జనసేన అలివి కాని డిమాండ్ ను అంగీకరించే పరిస్థితి లేదు.
Also Read:Sarayu Roy: బెడ్ పై బోర్లా పడుకొని ఎద అందాలు చూపిస్తూ బిగ్ బాస్ సరయు బోల్డ్ ట్రీట్!
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Janasena is ready to contest the 2024 elections alone
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com