ఏపీలోని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ చేయవద్దని చేపట్టిన ఉద్యమం రోజురోజుకు ఉధృతం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే తన ప్రతిపాదనను నిలిపివేయాలని ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగులు నిరాహార దీక్షలు సైతం చేస్తున్నారు. తమ ప్రాణాలు పోయినా.. ఉక్కు పరిశ్రమను ప్రయివేటుపరం కానివ్వబోమని అంటున్నారు. కార్మికుల ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీలు సైతం జత కట్టాయి. ఫ్యాక్టరీ ప్రయివేటీకరణ నిలిపివేసేవరకు ఆందోళన కొనసాగిస్తామని అంటున్నాయి.
Also Read: విశాఖలో న్యూ ఎంట్రీ..: ఇప్పటికే పోస్కో కంపెనీతో ఒప్పందం
దీంతో ఇప్పుడు విశాఖ ఉక్కు సెగలతో మండిపోతోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే ర్యాలీలు, రాస్తారోకోలు చేసిన కార్మికులు ఈనెల 18 నుంచి వారి భార్యాబిడ్డలతో రోడ్డుమీదకు వచ్చి నిరవధిక నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వారు సిద్ధం అవుతున్నారు.
మరోవైపు రాజకీయ పార్టీలు సైతం ఉక్కు కార్మికులకు మద్దతుగా ముందుకు సాగుతున్నాయి. వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా నిరాహార దీక్షలో పాలు పంచుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఇతర పార్టీల నాయకులు సైతం దీక్షలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు.
Also Read: వారికి జీతాలు పెంచరట..! బిరుదులిస్తారంట..!!
ఇవన్నీ ఇలా ఉంటే.. విశాఖ ఉక్కుకోసం పోరాటాలు సాగుతున్న అతి కీలకమైన సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ టూర్ కు సిద్ధం అయ్యారు. ఆయన ఈనెల 17న విశాఖలోని శ్రీ శారదాపీఠాన్ని సందర్శించనున్నారు. శారదాపీఠం వార్షికోత్సవాల సందర్భంగా తొలిరోజు అయిన 17న జగన్ హాజరై స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు. ఆ తరువాత తిరిగి క్యాంపు కార్యాలయానికి వస్తారు. మొత్తానికి సీఎం జగన్ విశాఖ టూరు ఖరారు అయ్యింది. మరి విశాఖలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో అన్ని వైపుల నుంచి జగన్ టూర్ మీద పెద్ద ఎత్తున ఆస్తకి వ్యక్తం అవుతోంది. స్వామివారిని కలిసిన అనంతరం ఉక్కు పరిశ్రమపై ఏమైన మాట్లాడతారా..? అన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Jagan vizag tour what is the reason
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com