
ఒక మహిళ వీల్ ఛైర్ లో కూర్చుని పక్షవాతంతో బాధ పడుతున్నట్లు నటిస్తూ భిక్షాటన చేస్తోంది. సాధారణంగా అలా భిక్షాటాన చేస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. రోడ్డుపై వెళ్లేవాళ్లు జాలి, దయ, మానవత్వంతో అలాంటి వాళ్లకు సాయం చేస్తూ ఉంటారు. అయితే అలా పక్షవాతంతో బాధ పడుతున్నట్టు నటిస్తున్న ఈజిఫ్ట్ కు చెందిన మహిళ అలా ప్రజలను మోసం చేస్తోందని.. ఆమె బిచ్చగత్తె కాదని కోటీశ్వరురాలని తెలిసి అధికారులే షాకయ్యారు.
Also Read: చరిత్ర: దీపావళి.. టపాసులు.. ఎప్పుడు, ఎక్కడ పుట్టాయి?
ఆ మహిళ నిజంగా పక్షవాతంతో బాధ పడటం లేదని డబ్బు కోసం ఆ విధంగా నటిస్తోందని తెలిసి ఆశ్చర్యపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే నఫిసా అనే మహిళ వీల్ ఛైర్ లో కూర్చుని డబ్బు కోసం యాచించేది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వీల్ ఛైర్ లో కూర్చుని నటించే నసిఫా సాయంత్రం కాగానే నడుచుకుంటూ వెళ్లిపోయేది. దీంతో కొందరు పోలీసులకు సదరు మహిళ గురించి సమాచారం ఇచ్చారు.
విషయం తెలిసిన పోలీసులు మహిళను అదుపులోకి తీసుకొని విచారించగా ఆమె తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని వెల్లడించింది. ఆమె రెండు బ్యాంక్ ఖాతాలలో కోటీ 42 లక్షల రూపాయలు గర్బేరియా, కాలియుబియా ప్రాంతాలలో ఐదు ఇళ్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు. అంత పెద్ద మొత్తంలో మహిళలకు ఆస్తులు ఎలా వఛ్చాయో, డబ్బును ఏ విధంగా సంపాదించిందో తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Also Read: శరవేగంగా విజృంభిస్తున్న కరోనా.. అక్కడ నెలరోజులు లాక్ డౌన్..?
పోలీసులు సదరు మహిళపై తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు. పోలీసులు యాచకురాలు గురించి మరింత అధ్యయనం చేసి ఆమెను కోర్టులో హాజరు పరుస్తామని చెబుతున్నారు. సదరు మహిళ వయస్సు 57 సంవత్సరాలు కాగా ఈ కేసు గురించి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.