
కరోనా వ్యాధి సోకి ఇప్పటి వరకు మృతి చెందిన వారి గురించి తెలుసు. తాజాగా కరోనా వ్యాక్సిన్ ప్రయోగించిన వలంటీర్ మృతి చెందినట్లు బ్రెజిల్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్వీడన్‌కు చెందిన అస్ట్రాజెనాకా- ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం కలిసి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మూడోదశలో భాగంగా ఓ వలంటీర్‌కు ఇచ్చారు. దీంతో ఆయన మృతి చెందారు. అయితే ఈ వ్యాక్సిన్‌తోనే మరణించాడా..? లేక ఇతర కారణాలున్నాయా..? అనే కోనంలో వైద్య ఆరోగ్యశాఖ పరిశీలిస్తుందన్ని అక్కడి ప్రభుత్వం తెలిపింది.