పాకిస్థాన్ ఎంపీ అయాజ్ పై దేశద్రోహం కేసు నమోదైంది. భారత్ తమపై దాడి చేస్తుందనే భయంతో వింగ్ కమాండర్ అభినందన్ ను పాక్ విడుదల చేసిందని చెప్పిన ఎంపీ అయాజ్ సాధిక్ పై చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ దేశవ్యాప్తంగా అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలన్న డిమాండ్ సర్వత్రా వినిపించాయి. దీంతో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలన్న డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటున్నామని పాక్ మంత్రి ఎజా షా తెలిపారు. అయితే ప్రతిపక్ష పార్టీ పీఎంఎల్-ఎన్ పార్టీ మాత్రం రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపించింది.