టిక్‌టాక్ యాప్‌ను ఒక్కో దేశం బ్యాన్ చేస్తూ వస్తోంది. మొదట చైనా ఆగడాలకు వ్యతిరేకంగా టిక్‌టాక్‌ను బ్యాన్ చేసింది. అదే బాటలో అమెరికా కూడా ఈ యాప్‌ను నిషేధించాలని ఆదేశాలు జారి చేసింది. తాజాగా చైనాకు మిత్ర దేశం అని చెప్పుకుంటున్న పాకిస్థాన్ కూడా టిక్‌టాక్‌ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ యాప్‌లో అసభ్యకరమైన సమాచారం వస్తున్న నేపథ్యంలో అనేక ఫిర్యాదులు వచ్చాయి. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించాలని ఆ సంస్థకు ఆదేశాలు జారీ చేసినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో టిక్‌టాక్ యాప్ నిషేధిస్తున్నట్లు పాకిస్థాన్ టెలీకమ్యూనికేషన్ అథారిటీ ఆదేశాలు జారీచేసింది. పాకిస్థాన్‌లో ఈ యాప్‌నకు దాదాపు 39 మిలియన్ల డౌన్‌లోడ్లు ఉన్నాయి.