కరోనా వైరస్‌పై భారత్ వ్యాక్సిన్ యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే అమెరికా, రష్యా, ఇంగ్లాండ్‌లో కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తుండగా భారత్‌లోనూ పరిశోధనలు జరుగుతున్నాయి. హైదరాబాద్ ఫార్మ కంపెనీ భారత్ బయోటెక్ తీసుకొస్తున్న ‘కోవాగ్జిన్’ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు జారీ చేసింది. తొలి రెండు దశలకు సంతృప్తి చెందిన ఆ సంస్థ మూడో దశ కూడా చేపట్టేందుకు అనుమతులు జారీ చేసింది. దీంతో త్వరలో ‘కోవాగ్జిన్’కు సంబంధించి ఫేజ్-3 ట్రయల్స్ చేపట్టనున్నారు. ఇటీవల తెలంగాణ గవర్నర్ భారత్ బయోటెక్ సంస్థను సందర్శించి జనవరి కంటే ముందుగానే వ్యాక్సిన్ వస్తుందని ప్రకటించారు. దీంతో ఆ దిశగా పరిశోధనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.