https://oktelugu.com/

మోడర్నా తీసుకున్న వైద్యుడికి సైడ్ ఎఫెక్ట్..! ఆసుపత్రికి తరలింపు

కరోనా నివారణ నేపథ్యంలో అనేక వ్యాక్సిన్లు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ వివిధ రకాల అనుమతులు పొంది పంపిణీ చేస్తోంది. ఇటీవల మరో కంపెనీ మోడోర్నా కంపెనీ సైతం ఎఢీఏ అనుమతి పొంది వ్యాక్సిన్ ఇస్తోంది. అయితే తాజగా ఆ కంపెనీ వ్యాక్సిన్ తీసుకున్న ఓ డాక్టర్ అస్వస్థతకు గురయ్యాడు. వ్యాక్సిన్ తీసుకోగానే మైకం వచ్చినట్లు అయిందని, ఆ తరువాత గుండె వేగంగా కొట్టుకుంటోందని అమెరికా మీడియా తెలిపింది. దీంతో ఆతనిని వెంటనే చికిత్స […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 26, 2020 / 02:03 PM IST
    Follow us on

    కరోనా నివారణ నేపథ్యంలో అనేక వ్యాక్సిన్లు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ వివిధ రకాల అనుమతులు పొంది పంపిణీ చేస్తోంది. ఇటీవల మరో కంపెనీ మోడోర్నా కంపెనీ సైతం ఎఢీఏ అనుమతి పొంది వ్యాక్సిన్ ఇస్తోంది. అయితే తాజగా ఆ కంపెనీ వ్యాక్సిన్ తీసుకున్న ఓ డాక్టర్ అస్వస్థతకు గురయ్యాడు. వ్యాక్సిన్ తీసుకోగానే మైకం వచ్చినట్లు అయిందని, ఆ తరువాత గుండె వేగంగా కొట్టుకుంటోందని అమెరికా మీడియా తెలిపింది. దీంతో ఆతనిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థతి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఫైజర్ టీకా తీసుకున్న వారికి కూడా కొన్ని రకాల అలర్జీలు వచ్చాయని అమెరికా మీడియా తెలిపింది.