కరోనా కేసులు విజ్రుంభిస్తున్న నేపథ్యంల మెక్సికన్ అధికారులు మళ్లీ లాక్ డౌన్ ప్రకటించారు. శనివారం నుంచి జనవరి 10వ తేదీ వరకు ఈ లాక్ డౌన్ ఉంటుందని తెలిపారు. అయితే రాజధాని, శివారు ప్రాంతాల నివాసితులు మాత్రం స్వేచ్ఛగా తమ రవాణాను సాగించుకోవచ్చు. కానీ దుకాణాలు మూసివేయడంతో పాటు పలు కార్యక్రమాలను రద్దు చేశారు. ప్రస్తుతం మెక్సికోలో 75 శాతం ఆసుపత్రులు కరోనా పేషెంట్స్ తో నిండిపోయాయి. అందువల్ల పాక్షిక లాక్ డౌన్ తప్పలేదని అధికారులు ప్రకటించారు.కాగా మెక్సికోలో కరోనాతో లక్ష మందివరకు మరణించారు.