
అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జో బైడెన్ వాషింగ్డన్ డీసీలో క్లీన్ స్వీప్ చేశారు. ఇప్పటి వరకు ఆయనకు 93 శాతం పాపులర్ ఓట్లు లభించాయి. ట్రంఫ్ నకు కేవలం 5.6 శాతంవచ్చాయి. 6 లక్షలకు పైగా జనాభా కలిగిని డీసీలో బీడెన్ కు 2 లక్షలకు పైగా ఓట్లు పడ్డాయి. ట్రంప్ కేవలం 12 వేల ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. అయితే దేశంలో అతి చిన్న నగరం కావడంతో ఇక్కడ ఎలక్టోరల్ ఓట్లు కేవలం 3 మాత్రమే ఉన్నాయి. కాగా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. వీరిద్దరి మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.