హీరోయిన్ సుమలత ఎవరి కూతురు.? ఎవరిని చేసుకుందో తెలుసా?

చిరంజీవి సరసన శుభలేఖ, ఖైదీ వంటి హిట్ చిత్రాలు చేసిన సుమలత గురించి ఈ తరం వారికి చాలా తక్కువ తెలుసు. ‘శృతిలయలు’ వంటి సంగీత భరిత చిత్రం ద్వారా ఆమె తెలుగుతెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగు, కన్నడ , తమిళ చిత్రాల్లో నటించి గొప్ప పేరు సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో సుమలత ఎవరు.? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటీ.? అనేది తెలుసుకుందాం. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ * సుమలత […]

Written By: NARESH, Updated On : November 4, 2020 4:36 pm
Follow us on

చిరంజీవి సరసన శుభలేఖ, ఖైదీ వంటి హిట్ చిత్రాలు చేసిన సుమలత గురించి ఈ తరం వారికి చాలా తక్కువ తెలుసు. ‘శృతిలయలు’ వంటి సంగీత భరిత చిత్రం ద్వారా ఆమె తెలుగుతెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగు, కన్నడ , తమిళ చిత్రాల్లో నటించి గొప్ప పేరు సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో సుమలత ఎవరు.? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటీ.? అనేది తెలుసుకుందాం.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

* సుమలత ప్రొఫైల్
1963 ఆగస్టు 27న సుమలత మద్రాసులో పుట్టింది. ఆమె తండ్రి వి. మదన్ మోహన్, తల్లి రూపా మోహన్. ఉద్యోగ రీత్యా తండ్రితో పాటు వెళ్లి బొంబాయి, ఆంధ్రప్రదేశ్ లో పెరిగింది. సుమలతకు ఆరు భాషలు వచ్చు. గుంటూరులో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ ఏట సినిమా రంగంలో ప్రవేశించింది.

తెలుగు సినిమాలే కాదు.. తమిళ, కన్నడ, మళయాల మరియు హిందీ చిత్రాల్లో కూడా సుమలత నటించింది. విజయ్ చందర్ హీరోగా నటించి బాపు దర్శకత్వంలో వచ్చిన ‘రాజాధిరాజు’ ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తర్వాత సూపర్ స్టార్ కృష్ణతో సమాజానికి సవాల్ సినిమాలో నటించి స్టార్ డం తెచ్చుకుంది.

Also Read: వైరల్ అవుతున్న ప్రభాస్ మరో ఫోటో !

సినీ రంగంలో దాదాపు 11 ఏళ్లపాటు పనిచేసి డిసెంబర్ 8 1992లో సహకన్నడ నటుడు అంబరీష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అనంతరం బెంగళూరులో ప్రస్తుతం స్థిరపడింది. ఈమె అంబరీష్ తో కలిసి ఆహూతి, అవతార పురుష, శ్రీమంజునాథ, కల్లరలి హూగవి మొదలైన కన్నడ సినిమాల్లో నటించింది. ఈమెకు అభిషేక్ అనే ఒక కొడుకు ఉన్నాడు.

ఆ తర్వాత సినిమాలకు దూరమైన సుమలత చాలా కాలం తర్వాత తెలుగు సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది. 2006లో నాగార్జున హీరోగా వచ్చిన ‘బాస్’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. మోహన్ బాబు గేమ్ సినిమాలో జడ్జి పాత్రలో నటించింది. ఆ తర్వాత అడపాదడపా పాత్రల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.

Also Read: కరోనాకు ‘నో’.. తికమకపెడుతున్న సెలబ్రెటీలు..!

ఇక సుమలత సినిమాలే కాదు తెలుగు బుల్లితెరపై కూడా సందడి చేసింది. జీ తెలుగులో వచ్చిన ‘బతుకు జట్కా బండి’ అనే సామాజిక కార్యక్రమానికి సుమలత వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కన్నడ నటుడు అంబరీష్ ను పెళ్లి చేసుకున్నాక దాదాపు సినిమాలకు దూరమైన సుమలత మళ్లీ కర్ణాటక నుంచి మాండ్యా లోక్ సభ స్థానంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు.. ఆ మధ్య అనారోగ్యంతో అంబరీష్ మరణించడంతో ఆయన కుటుంబం నుంచి కన్నడ రాజకీయాల్లోకి వచ్చారు.