
అమెరికాలో జరుగుతున్న ఎన్నికల్లో భారతీయులు సత్తా చాటుతున్నారు. యూఎస్ ప్రతినిధుల సభకు భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి మూడోసారి విజయం సాధించారు. కృష్ణ మూర్తి స్వస్థలం తమిళనాడు రాష్ట్రం అయినా ఢిల్లీలో పెరిగారు. అనంతరం యూఎస్ వెళ్లి స్థిరపడ్డారు. 2016 ఎన్నికల్లో తొలిసారి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో రాజా కృష్ణ మూర్తికి 71 శాతం ఓట్లు రావడం విశేషం.
మరో ఇద్దరు భారతీయులు అమీ బేరా, ఆర్ వో కన్నాలు కూడా ప్రతినిధుల సభకు పోటీ చేశారు. ఇందులో అమీరా బేగా నాలుగుసార్లు గెలిచారు. ఐదోసారి బరిలో ఉన్నారు. ఖన్నా రెండు సార్లు గెలిచి మూడో విజయం కోసం ఎదురుచూస్తుననారు.