Homeఇంటర్నేషనల్Indian pharma companies: పంచ్ ఫలక్ నామాకే పంచా? ఇది మామూలు స్ట్రోక్ కాదు.. ట్రంప్...

Indian pharma companies: పంచ్ ఫలక్ నామాకే పంచా? ఇది మామూలు స్ట్రోక్ కాదు.. ట్రంప్ కు షాకిస్తోన్న భారత ఫార్మా కంపెనీలు..

Indian pharma companies : డొనాల్డ్‌ ట్రంప్‌ పాలనలో అమెరికా గ్రేట్‌ అవుతుందనుకుంటే… రాబోయే మూడేళ్లలో పూర్తిగా దెబ్బతినే సూచనలే కనిపిస్తున్నాయి. ట్రంప్‌ నిర్ణయాలు అమెరికాను అప్పుల కుప్పగా మారుస్తోంది. మరోవైపు ప్రపంచ దేశాలను తన కంట్రోల్‌లో పెట్టుకునేందుకు బిజినెస్‌ డీల్స్, సుంకాల పేరుతో ట్రంప్‌ బెదిరింపులకు దిగుతున్నాడు. తాజాగా అమెరికా ఫార్మా సంస్థలపై 200 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు. ట్రంప్‌ తీరుపై భారత ఫార్మా కంపెనీలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read: ఓటర్ల జాబితానే గ్యాంబ్లింగ్‌.. మోడీని ఈసీ కాపాడుతోందా?

అతిపెద్ద మార్కెట్‌ అమెరికానే..
భారత పార్మా ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌. 2024–25లో 30 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల్లో 31% (9.7 బిలియన్‌ డాలర్లు) అమెరికాకు వెళ్లాయి. అయితే 200 శాతం సుంకం విధిస్తే, జనరిక్‌ ఔషధాల ధరలు పెరిగి, అమెరికా వినియోగదారులతో పాటు భారత సంస్థలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాయని సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు చూపు..
భారత ఫార్మా సంస్థలు అమెరికాపై ఆధారపడటం గణనీయంగా ఉంది. 47% జనరిక్‌ ఔషధాలు, 15% బయోసిమిలర్‌లు అమెరికాకు సరఫరా అవుతున్నాయి. సన్‌ ఫార్మా, డా. రెడ్డీస్, లూపిన్, గ్లాండ్‌ ఫార్మా వంటి సంస్థలు తమ ఆదాయంలో 30–50% అమెరికా నుంచి పొందుతున్నాయి. అయితే, ట్రంప్‌ సుంకం బెదిరింపులతో, ఈ సంస్థలు యూరప్, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా వంటి ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు చూస్తున్నాయి. ఈ మార్పు సెటైరికల్‌గా అమెరికాకు ఒక గుణపాఠం కాగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.

దరలు పెంచక తప్పదు..
భారత ఫార్మా సంస్థలు, ముఖ్యంగా జనరిక్‌ ఔషధాలపై తక్కువ లాభాలతో పనిచేసే సంస్థలు, 200% సుంకం భరించడం అసాధ్యమని స్పష్టం చేస్తున్నాయి. ఈ సుంకాలు విధిస్తే, ఔషధ ధరలు పెరగడం లేదా కొన్ని ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేయడం తప్పనిసరి కావచ్చు, దీనివల్ల అమెరికాలో ఔషధ కొరత(271 ఔషధాల కొరత 2024లో ఇప్పటికే ఉంది) తీవ్రమవుతుంది.

భారత ఫార్మా వ్యూహాత్మక రియాక్షన్‌..
భారత ఫార్మా సంస్థలు ఈ సవాల్‌ను ఎదుర్కోవడానికి వ్యూహాలను రూపొందిస్తున్నాయి. కొన్ని సంస్థలు అమెరికాలోనే తయారీ యూనిట్లను విస్తరించాలని ఆలోచిస్తున్నాయి, అయితే ఇది 12–24 నెలల సమయం, బిలియన్ల డాలర్ల పెట్టుబడి అవసరమవుతుంది. ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ అలయన్స్‌ అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఔషధాలపై భారత్‌లో విధించే 5–10% సుంకాన్ని తొలగించాలని లాబీయింగ్‌ చేస్తోంది, దీనివల్ల ట్రంప్‌ సుంకాల విధింపు ఆలోచన మార్చవచ్చని భావిస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular