భయపెడుతున్న స్ట్రెయిన్: అమెరికాలో భారీగా కేసులు

బ్రిటన్లో మొదలైన కొత్త కరోనా స్ట్రేయిన్ మరోసారి అమెరికాను కలవరపెడుతోంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టి మరోసారి కేసులు పెరగడంతో కొత్త స్ట్రెయిన్ ప్రభావమేనని వైద్యులు తెలుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 8.43 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదవగా నిన్న ఒక్కరోజులో అమెరికాలో 1,63,252 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 2,085 మంది మరణించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇక బ్రిటన్ లోనూ రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. […]

Written By: Suresh, Updated On : January 2, 2021 9:24 am
Follow us on

బ్రిటన్లో మొదలైన కొత్త కరోనా స్ట్రేయిన్ మరోసారి అమెరికాను కలవరపెడుతోంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టి మరోసారి కేసులు పెరగడంతో కొత్త స్ట్రెయిన్ ప్రభావమేనని వైద్యులు తెలుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 8.43 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదవగా నిన్న ఒక్కరోజులో అమెరికాలో 1,63,252 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 2,085 మంది మరణించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇక బ్రిటన్ లోనూ రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 53,285 కొత్త కేసులు నమోదయ్యాయి. 613 మంది చనిపోయారు. దీంతో కొత్త స్ట్రెయిన్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.