https://oktelugu.com/

పాకిస్థాన్ మాజీ ప్రధాని కుమారులపై కేసు నమోదు

కరోనా నిబంధనలు ఉల్లంఘించారని పాకిస్థాన్ మాజీ ప్రధాని కుమారులపై కేసు నమోదైంది. నవంబర్ 30వ తేదీన 11 పార్టీల కూటమి అయిన పాకిస్థాన్ డెమొక్రటిక్ మూవ్ మెంట్ ఆధ్వర్యంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలాని ముగ్గురు కుమారులైన అలీమూసాగిలానీ, అబ్దుల్ ఖాదిన్ గిలానీ, అలీ హైదర్ గిలానీలతో పాటు మరికొంతమంది ముల్తాన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో బాణ సంచా పేల్చడంతో గిడ్డంగులలో మంటలు చెలరేగాయని కార్డు బోర్డు గిడ్డంగి యజమాని పోలీసులకు ఫిర్యాదు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 2, 2020 / 03:48 PM IST
    Follow us on

    కరోనా నిబంధనలు ఉల్లంఘించారని పాకిస్థాన్ మాజీ ప్రధాని కుమారులపై కేసు నమోదైంది. నవంబర్ 30వ తేదీన 11 పార్టీల కూటమి అయిన పాకిస్థాన్ డెమొక్రటిక్ మూవ్ మెంట్ ఆధ్వర్యంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలాని ముగ్గురు కుమారులైన అలీమూసాగిలానీ, అబ్దుల్ ఖాదిన్ గిలానీ, అలీ హైదర్ గిలానీలతో పాటు మరికొంతమంది ముల్తాన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో బాణ సంచా పేల్చడంతో గిడ్డంగులలో మంటలు చెలరేగాయని కార్డు బోర్డు గిడ్డంగి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం 48 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో మాజీ ముస్లింలీగ్ షాహిద్ కూడా ఉన్నారు.