
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు కోర్టులో చుక్కెదురైంది. మిచిగాన్‌లో ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేశారు. బ్యాలెట్ డ్రాప్ బాక్సుల వీడియోను యాక్సెస్ చేయలేదని ఆరోపిస్తూ ట్రంప్ వేసిన దావాను తిరస్కరించామని క్రైం న్యాయమూర్తి సింథియా స్టీఫెన్ చెప్పారు. ఓట్ల లెక్కింపు పూర్తి కానున్న దశలో దీన్ని నిలిపివేయలేమని న్యాయమూర్తి స్టీఫెన్ పేర్కొన్నారు. కాగా కీలకమైన పెన్సిల్వేనియాలో ట్రంప్ ఆధిక్యత క్రమంగా తగ్గుతోంది. 20 ఎలక్టోర్ ఓట్లు ఉన్న ఇక్కడి 50 వేల పైచిలుకు మంది మాత్రమే పోలింగ్‌లో పాల్గొన్నారు.