https://oktelugu.com/

స్థానిక ఎన్నికలకు గుజరాత్ నై.. ఇక్కడ సై అంట.!

గుజరాత్‌.. ప్రధాని మోడీ కా అడ్డా అని చెప్పొచ్చు. ఆ రాష్ట్రం నుంచే కదా మోడీ ప్రధాని స్థాయి వరకు ఎదిగారు. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు అక్కడి ఎస్‌ఈసీ నై అంటున్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నికలు సాధ్యం కావని అభిప్రాయపడుతున్నారు. కానీ.. అక్కడి కంటే రెట్టింపు కేసులున్న ఏపీలో మాత్రం ఇక్కడి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌ స్థానిక ఎన్నికలకు సై అంటున్నారు. మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 5, 2020 / 01:12 PM IST
    Follow us on

    గుజరాత్‌.. ప్రధాని మోడీ కా అడ్డా అని చెప్పొచ్చు. ఆ రాష్ట్రం నుంచే కదా మోడీ ప్రధాని స్థాయి వరకు ఎదిగారు. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు అక్కడి ఎస్‌ఈసీ నై అంటున్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నికలు సాధ్యం కావని అభిప్రాయపడుతున్నారు. కానీ.. అక్కడి కంటే రెట్టింపు కేసులున్న ఏపీలో మాత్రం ఇక్కడి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌ స్థానిక ఎన్నికలకు సై అంటున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ఇప్పుడు ఎస్‌ఈసీ నిర్ణయం కాస్త రచ్చ అవుతోంది. చివ‌రికి వ్యవహారం హైకోర్టు వ‌ర‌కూ వెళ్లింది. క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించ‌డం స‌రికాదని ఏపీ స‌ర్కార్ వాదిస్తోంది. గ‌తంలో కంటే కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని, ఎన్నిక‌లు నిర్వహించాల‌ని మెజార్టీ రాజ‌కీయ పార్టీలు అభిప్రాయ‌ప‌డుతున్నాయ‌ని ఎస్ఈసీ నిమ్మగ‌డ్డ వాదిస్తున్నారు.

    Also Read: ఆ కేసుల నుంచి జగన్‌ తప్పించుకున్నారు!

    ఈ క్రమంలో గుజారాత్‌ అంశాన్ని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెరమీదకు తెచ్చింది. గుజరాత్‌లో అక్కడి ఎస్‌ఈసీ ఎన్నికలను వాయిదా వేయడాన్ని వివరిస్తోంది. గుజరాత్‌లో 31 జిల్లా పంచాయతీలు, 231 తాలూకా పంచాయతీలు, 55 మున్సిపాలిటీల పదవీ కాలం  డిసెంబర్‌ రెండో వారంతో ముగుస్తోంది. అయినా..  కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఎన్నిక‌ల‌ను వాయిదా వేస్తున్నట్టు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ 20 రోజుల క్రితమే ప్రకటించారు.

    ఇదే ఏపీ విష‌యానికొస్తే భిన్నమైన ప‌రిస్థితి. ఈ రాష్ట్రంలో 2018 ఆగస్టు 1 నాటికే గ్రామ పంచాయతీలు, జూలై 5వ తేదీ నాటికే మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పదవీ కాలం ముగిసిపోయింది. అంటే ఏడాది.. రెండేళ్ల క్రిత‌మే ప‌ద‌వీ కాలాల గ‌డువు ముగిసింది. అప్పటి నుంచి ఇన్‌చార్జీల పాల‌నే నడుస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఎట్టకేలకు ఎన్నికలు జరపాలని ప్రక్రియ ప్రారంభించారు. కానీ.. క‌రోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని వాయిదా వేస్తున్నట్టు ఆక‌స్మికంగా ప్రక‌టించారు. అప్పుడు కేవలం రోజుకు రెండు నుంచి మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి.

    Also Read: చంద్రబాబులోనూ ట్రంప్‌ లక్షణాలు.. నెటిజన్ల ట్రోల్‌?

    కానీ.. ఇప్పుడు వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. మరి అప్పుడు వాయిదా వేసిన ఎన్నికలను ఈ పరిస్థితుల్లో నిర్వహించడం ఏంటని అందరూ ఆశ్చర్య వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అందుకే.. ఈ ఎన్నికలను వాయిదా వేసేందుకు ఏపీ సర్కార్‌‌ కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది.