జూనియర్ ట్రంప్ నకు కరోనా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుటుంబం కరోనా కోరల్లో చిక్కుకుంటోంది. ఇప్పటికే ట్రంప్ తో పాటు ఆయన భార్య మెలానియా, చిన్న కుమారుడు బారన్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే. చికిత్స తీసుకొని వారు కోలుకున్నారు. తాజాగా ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ ట్రంప్ నకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవు. కానీ ఇటీవల ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న ఆయన టెస్ట్ చేయించుకోవడంతో పాజిటివ్ అని తేలింది. దీంతో […]

Written By: Suresh, Updated On : November 21, 2020 10:24 am
Follow us on

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుటుంబం కరోనా కోరల్లో చిక్కుకుంటోంది. ఇప్పటికే ట్రంప్ తో పాటు ఆయన భార్య మెలానియా, చిన్న కుమారుడు బారన్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే. చికిత్స తీసుకొని వారు కోలుకున్నారు. తాజాగా ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ ట్రంప్ నకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవు. కానీ ఇటీవల ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న ఆయన టెస్ట్ చేయించుకోవడంతో పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఆయనకు కొన్ని రోజుల కిందటే పాజిటివ్ నిర్దారణ కాగా తన క్యాబిన్ అధికార ప్రతినిధి తాజాగా వెల్లడించారు. ఇక ట్రంప్ దగ్గక పనిచేసే అధికారులు, వ్యక్తిగత కార్యదర్శులను కరోనా వీడడం లేదు.