
ఆస్ట్రేలియాలోని అడిలైట్ లో జరుగుతున్న మూడోరోజు టెస్టులో టీమిండియా 36కే ఆల్ ఔట్ అయింది. ఇది భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు. మొదటి ఇన్నింగ్స్ లో 53 పరుగుల ఆదిక్యతను సాధించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో ఆర్ంభంలోనే తడబడింది. 15 ఓవర్లలోనే తొలి వికెట్ కోల్పోయిన భారత్ 36 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయింది. బుమ్రా 2, పుజారా 0, మయాంక్ 9, రహనే 0, కెప్టెన్ కోహ్లి 4 పరుగుల వద్ద తిరుగుముఖం పట్టారు. 31 పరుగుల వద్ద హనుమ విహారి రూపంలో భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మహ్మద్ షమి రిటైర్డ్ హార్డ్ గా వెనుదిరిగాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో భారత్ 21 ఓవర్లలో 36 పరుగులు చేసింది. మొదటి ఇన్నంగ్స్ లో 53 పరుగులు కలుపుకొని మొత్తం ఆస్ట్రేలియా లక్ష్యం 90 పరుగులుగా ఉంది. కాగా టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యల్ప స్కోరుగా నమోదైంది.