
అమెరికాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. యూఎస్‌లోని ఈశాన్య రాష్ట్రమైన న్యూ హ్యాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లీ నాగ్ గ్రామంలో మంగళవారం త్లెవారుజామున ప్రజలు ఓటేశారు. ఆ గ్రామంలో మొత్తం 12 ఓట్లు ఉండగా ఐదు ఓట్లు పోలయ్యాయి. ఆ ఐదు ఓట్లు బైడెన్‌కు వేసినట్లు సమాచారం. డిక్స్‌విల్లీ గ్రామస్థులు డెమొక్రటిక్ అభ్యర్థికే ఓటు వేశారు. కాగా 1960 నుంచి సాంప్రదాయబద్ధంగా ఈ గ్రామం నంచే అమెరికా ఎన్నిక రోజున ఓటు ప్రక్రియ ప్రారంభమవుతుంది. గత ఎన్నికల్లో డిక్స్ విల్లీ గ్రామం ఓటర్లు హ్లిరీ క్లింటన్‌కు ఓటేశారు. కానీ ట్రంప్ విజయం సాధించారు.