https://oktelugu.com/

తిరుమల డిక్లరేషన్ వివాదంపై వైవీ సుబ్బారెడ్డి స్పందన

తిరుమలకు వచ్చే హిందూయేతరులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఇంతకుముందు మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి.. ఇది పెద్ద వివాదం చెలరేగడంతో తాజాగా వివరణ ఇచ్చారు. తన మాటలు వక్రీకరించారని.. మీడియా దీన్ని రాద్ధాంతం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ‘దయచేసి నా మాటలను వక్రీకరించకండి’ అని వైవీ సుబ్బారెడ్డి ఈ డిక్లరేషన్ వివాదంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. డిక్లరేషన్ అంశానికి కట్టుబడి ఉన్నామని.. శ్రీవారిని దర్శించుకునే హిందూయేతరులు డిక్లరేషన్ ఇవ్వాలని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 19, 2020 / 08:35 PM IST
    Follow us on

    తిరుమలకు వచ్చే హిందూయేతరులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఇంతకుముందు మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి.. ఇది పెద్ద వివాదం చెలరేగడంతో తాజాగా వివరణ ఇచ్చారు. తన మాటలు వక్రీకరించారని.. మీడియా దీన్ని రాద్ధాంతం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ‘దయచేసి నా మాటలను వక్రీకరించకండి’ అని వైవీ సుబ్బారెడ్డి ఈ డిక్లరేషన్ వివాదంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. డిక్లరేషన్ అంశానికి కట్టుబడి ఉన్నామని.. శ్రీవారిని దర్శించుకునే హిందూయేతరులు డిక్లరేషన్ ఇవ్వాలని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదానికి ముగింపు పలికారు.

    Also Read: అంతర్వేది వివాదం.. అసలు ఈ ఆలయ చరిత్ర తెలుసా?

    సీఎం జగన్ గతంలో పలుమార్లు శ్రీవారిని దర్శించుకున్న సమయంలో ఎప్పుడూ డిక్లరేషన్ సమర్పించలేదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే సోనియాగాంధీ, వైఎస్ఆర్ కూడా డిక్లరేషన్ పై సంతకం చేయలేదని ఆయన వివరించారు.

    శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే ఏ మతానికి చెందిన వారైనా దేవుడికి నమ్మకంతో వస్తే చాలని.. ఏ మతస్థులైనా స్వామిని దర్శించుకోవచ్చని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై పలు హిందూ సంఘాలు, ప్రతిపక్షాలు, బీజేపీ నేతలు తప్పుపట్టారు. వేరే మతస్థులను డిక్లరేషన్ లేకుండా ఎలా రానిస్తారని వివాదం చెలరేగింది.

    Also Read: 2 వేల నోట్లపై కేంద్రం క్లారిటీ..

    దీంతో తాజాగా ఈ వివాదంపై మరోసారి వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఈరోజు విలేకరులతో మాట్లాడారు. హిందూయేతరులు ఎవరైనా డిక్లరేషన్ పై సంతకం చేసి దర్శనం చేసుకోవాలని చట్టంలో ఉంది. సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు ఎవరూ సంతకం చేయడం లేదు. గుర్తించిన భక్తులు మాత్రమే డిక్లరేషన్ తీసుకుంటున్నాం.. అందరూ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.