చిత్రసీమలోకి అడుగుపెట్టిన ప్రతీఒక్కరు మెగాస్టార్ చిరంజీవితో కలిసి పని చేయాలని కోరుకుంటుంటారు. డైరెక్టర్లు, నిర్మాతలు చిరంజీవి సినిమా చేసేందుకు యేళ్లకు ఏళ్లు వెయిట్ చేసిన రోజులున్నాయి. కొందరికీ అవకాశాలు వెంటనే రాగా మరికొందరు చాలా ఏళ్ల తర్వాత వస్తుంటాయి. ఇక మరికొందరికైతే ఆ అవకాశం దక్కకుండానే ఇండస్ట్రీ నుంచి వైదొగుతుండటం చూస్తూనే ఉన్నాం. అయితే ఓ సంగీత దర్శకుడి కుమారుడికి తాజాగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఆఫర్ దక్కినట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read: వరుస సినిమాలతో దూసుకుపోతున్న నభా నటేష్
మెగాస్టార్ చిరంజీవి.. సంగీత దర్శకుడు మణిశర్మ కాంబినేషన్లో ఎన్నో చిత్రాలు వచ్చారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్నీ కూడా మంచి మ్యూజికల్ హిట్టుగా నిలిచాయి. మణిశర్మ చాలారోజుల గ్యాప్ తర్వాత చిరంజీవి ‘ఆచార్య’ మూవీకి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రం కోసం అదిరిపోయే బాణీలను సమకూర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు కరోనాతో నిలిచిపోగా త్వరలోనే ప్రారంభించేందుకు దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు.
మణిశర్మ తొలినాళ్లలో దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాలకు మ్యూజిక్ అందించేవాడు. ‘ఆంధం(హిందీలో ద్రోహి)’, ‘రాత్రి’ చిత్రాలతో మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేయడం ప్రారంభించారు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన తొలిచిత్రం ‘సూపర్ హీరోస్’. అయితే మణిశర్మకు ఇండస్ట్రీలో బ్రేక్ ఇచ్చింది మాత్రం చిరంజీవే. ‘బావగారు బాగున్నారా’.. ‘చూడాలని వుంది’ సినిమాలకు మణిశర్మ మ్యూజిక్ అందించి బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నారు. ఈ మూవీ తర్వాత మణిశర్మ ఇక వెనుతిరిగి చూడలేదు.
తాజాగా ఆయన కుమారుడికి చిరంజీవి మూవీ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ ఇప్పటికే పలు సినిమాలకు మ్యూజిక్ అందించాడు. ‘ఛలో’ సినిమాతో మ్యూజికల్ డైరెక్టర్ గా తొలి హిట్టు అందుకున్న స్వరసాగర్ తాజాగా ‘భీష్మ’తో మరో హిట్టు అందుకున్నాడు. అయినా స్వరసాగర్ కు పెద్ద సినిమా ఆఫర్లు రావడం లేదట.
Also Read: ఔరా.. అనిపిస్తున్న ‘బిగ్ బాస్’ పేమెంట్లు..!
అయితే ‘ఛలో’ సినిమాల పాటలు విన్న చిరంజీవికి అతడి మ్యూజిక్ నచ్చడంతో తన తదుపరి సినిమాకు మ్యూజిక్ చేసే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి నటించనున్న ‘వేదాలమ్’ రీమేక్ మూవీకి స్వరసాగర్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసే అవకాశం ఉందనే టాక్ విన్పిస్తోంది. గతంలో తండ్రికి బ్రేక్ ఇచ్చిన చిరంజీవి ఇప్పుడు అతడి కుమారుడికి కూడా బ్రేక్ ఇస్తాడో లేదో వేచిచూడాల్సిందే..!