తెలుగులో నెంబర్ వన్ రియల్టీ షోగా కొనసాగుతన్న ‘బిగ్ బాస్’ తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. కరోనా సమయంలో బిగ్ బాస్-4 సీజన్ ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే వాటన్నింటిని పఠపంచలు చేస్తూ బిగ్ బాస్ నిర్వహాకులు ‘బిగ్ బాస్-4’ సీజన్ ప్రారంభించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ బిగ్ బాస్ షో ప్రారంభం విశేషం.
Also Read: వరుస సినిమాలతో దూసుకుపోతున్న నభా నటేష్
బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభానికి ముందే కంటెస్టులందరికీ నిర్వాహాకులు కరోనా టెస్టులు నిర్వహించారు. 15రోజులపాటు అబ్జర్వేషన్లో ఉంచారు బిగ్ బాస్ హౌజ్ కు పంపించిన సంగతి తెల్సిందే. కరోనా కారణంగా బిగ్ బాస్ అనుకున్న కంటెస్టులు దొరకకపోయిన వేరేవారితో షోను నిర్వహించేందుకే నిర్వాహకులు మొగ్గుచూపారు. దీంతో ఈసారి బిగ్ బాస్ షోలో పెద్దగా సెలబ్రెటీలు లేరని టాక్ విన్పిస్తోంది. అయితే బిగ్ బాస్-4 సీజన్ కోసం నిర్వాహకులు కంటెస్టులకు అదిరిపోయే రెమ్యూనరేషన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్-4 సీజన్ నుంచి తొలి ఎలిమినేట్ అయిన దర్శకుడు సూర్యకిరణ్ కు బిగ్ బాస్ నిర్వహాకులు భారీగా ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. సూర్యకిరణ్ అడిగిన పారితోషికం కంటే పదింతలు ఎక్కువగా ఇచ్చినట్లు ఆయన ఓ ఇంటర్య్వూలో చెప్పాడు. దర్శకుడు సూర్యకిరణ్ ఈ జనరేషన్ వాళ్లకు పెద్దగా తెలియదు. అయినా కూడా అతడికి బిగ్ బాస్ భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చారంటే మిగతా కంటెస్టులకు ఇంకా పెద్దమొత్తంలో పారితోషికం అందుతుందనే టాక్ విన్పిస్తోంది.
Also Read: పేరుకే చిన్నవి టెక్కులో మాత్రం పెద్దవి !
తాజాగా బిగ్ బాస్-4 సీజన్లో ఎంట్రీ ఇచ్చిన కామెడియన్ ముక్కు అవినాష్ ఈ షోలో పాల్గొనేందుకు ‘జబర్దస్త్’ కాంట్రాక్టును రద్దు చేసుకున్నాడట. ఇందుకోసం అతడు ఏకంగా 10లక్షల రూపాయాలను మల్లెమాల నిర్మాణ సంస్థకు చెల్లించినట్లు టాక్ విన్పిస్తోంది. దీనిని బట్టి బిగ్ బాసులో ముక్కు అవినాష్ కు ఏ రేంజులో పారితోషికం అందనుందో అర్థం చేసుకోవచ్చు.
ఇక హీరోయిన్ మొనాల్, నోయల్, అభిజిత్, దెత్తడి హరిక, గంగవ్వ, లాస్య, దివి, దేవి నాగవల్లి తదితరులు కూడా బిగ్ బాస్ కళ్లు చెదిరిపోయే రెమ్యూనరేషన్ ఇవ్వనున్నారట. బిగ్ బాస్ కు హోస్టుగా చేస్తున్న నాగార్జున ఒక్కో ఎపిసోడ్ కు నిర్వాహకులు రూ.16లక్షలు చెల్లిస్తున్నారట. కరోనాలో సమయంలోనూ బిగ్ బాస్ కోసం కంటెస్టులు చేసిన రిస్కును గుర్తించే నిర్వాహకులు వారికి భారీ పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తోంది.