https://oktelugu.com/

TRS Drinkers Party: టీఆర్ఎస్ పేరు మార్చిన కాంగ్రెస్, వైఎస్సార్ టీపీ

TRS Drinkers Party: హైదరాబాద్ లో అత్యాచారాలు ప్రజలను భయభ్రాతులకు గురి చేస్తున్నాయి. వారం రోజుల్లో రెండు ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేక పడుకుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ టీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగడంతో ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు పెట్టింది. దీంతో బీజేపీ కాస్త నిశ్శబ్ధంగా ఉండటంతో ప్రస్తుతం కాంగ్రెస్, వైఎస్సార్ టీపీ లు టీఆర్ఎస్ పై దుమ్మెత్తి పోస్తున్నాయి. […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 9, 2022 / 05:55 PM IST
    Follow us on

    TRS Drinkers Party: హైదరాబాద్ లో అత్యాచారాలు ప్రజలను భయభ్రాతులకు గురి చేస్తున్నాయి. వారం రోజుల్లో రెండు ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేక పడుకుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ టీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగడంతో ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు పెట్టింది. దీంతో బీజేపీ కాస్త నిశ్శబ్ధంగా ఉండటంతో ప్రస్తుతం కాంగ్రెస్, వైఎస్సార్ టీపీ లు టీఆర్ఎస్ పై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరగడంతో ప్రభుత్వం ఏం చేస్తుందని షర్మిల, కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

    ys sharmila-kcr

    టీఆర్ఎస్ నేతల ప్రోద్బలంతోనే ఆడపిల్లలపై అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయనే వాదనలు కూడా వస్తున్నాయి. జూబ్లీహిల్స్ లో బాలికపై అత్యాచారం ఘటనలో అధికార పార్టీ నేతలే ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మరో ఘటనలో కార్ఖానా ప్రాంతంలో కూడా బాలికపై ఐదుగురు దుండగులు అత్యాచారం చేయడం సంచలనం కలిగిస్తోంది. దీంతో ప్రతిక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రభుత్వ విధానాన్ని ఎండగడుతున్నాయి. మహిళలపై జరుగుతున్న దాడులకు ఏం సమాధానం చెబుతారని అడుగుతుంటే టీఆర్ఎస్ నేతలు మాత్రం పెదవి విప్పడం లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం మాత్రం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల నిలదీస్తున్నారు.

    Also Read: Cordelia Cruise Ship: విశాఖలో.. విహార నౌక.. క్రేజీ క్రూయిజ్‌ వచ్చింది!!

    టీఆర్ఎస్ పార్టీకి కొత్త నిర్వచనం చెబుతున్నారు. తాగుబోతుల రేపిస్టుల పార్టీగా అభివర్ణిస్తున్నారు. ఆడపిల్లలపైనే కాదు మహిళలపై కూడా అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. అయినా సర్కారు నోరు మెదపడం లేదు. వారికే వత్తాసు పలుకుతోంది. ఫలితంగా అప్రదిష్ట మూటగట్టుకుంటోంది. అయినా ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు. అందుకే రోజురోజుకు దురాగాతాలు పెరుగుతున్నాయి. అందుకే అటు కాంగ్రెస్ ఇటు వైఎస్సార్ టీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.

    KCR

    ఊరంతా కంపు కంపు ఊరి బయట ఊరేగింపు అన్నట్లుగా పాలకుల వ్యవహారం ఉంటోంది. ఇక్కడేమో ప్రజలను పట్టించుకోకుండా విదేశాల్లో మాత్రం కోట్లు ఖర్చు చేస్తూ డాబులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుల గుర్తింపు వారిపై శిక్షలు వేయించేందుకు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో తెలియడం లేదు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజలను బాధలకు గురి చేస్తోందనే వాదనలు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం పని చేస్తుందా? లేక చోద్యం చూస్తుందా? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు కూడా గాంధీభవన్ లో మౌన దీక్షలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

    Also Read:Nara Lokesh Zoom Meeting: లోకేష్ కు లైవ్ లో షాకిచ్చిన కొడాలి నాని, వల్లభనేని వంశీ

    Tags