Nidhhi Agerwal: పవన్ కళ్యాణ్ హీరోయిన్ నిధి అగర్వాల్ టెంప్టింగ్ ఫోజులతో మంట పుట్టిస్తున్నారు. చాలీ చాలని టాప్ ధరించి ఎద అందాలు చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తున్నారు. నిధి లేటెస్ట్ గ్లామర్ ట్రీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు కట్టిపడేసే గ్లామర్, మెప్పించే నటన ఉండి కూడా స్టార్ హీరోయిన్ కాలేకపోతోంది నిధి. కెరీర్ బిగినింగ్ నుండి ఒకటి అరా మినహాయించి, ఆమెకు సరైన హిట్స్ తగల్లేదు. నిధి కెరీర్ లో క్లీన్ హిట్ ఒక్క ఇస్మార్ట్ శంకర్ మాత్రమే. దర్శకుడు పూరికి కమ్ బ్యాక్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నిధి మెయిన్ హీరోయిన్ గా నటించారు.
ఒక్క హిట్ పడిందో లేదో వరుసగా మూడు ప్లాప్స్ ఇచ్చింది. 2021లో వరుసగా రెండు తమిళ చిత్రాలు విడుదల చేశారు నిధి. శింబుకు జంటగా ఈశ్వరన్ మూవీ చేశారు. అలాగే జయం రవితో భూమి టైటిల్ తో మరొక చిత్రం విడుదలైంది. ఈ రెండు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. అనూహ్యంగా మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా డెబ్యూ మూవీ ‘హీరో’ లో ఛాన్స్ దక్కించుకుంది.
Also Read: Nayanathara wedding: వైరల్ గా నయనతార-విఘ్నేష్ శివన్ ల పెళ్లి.. ఏర్పాట్లు చూస్తే దిమ్మదిరగాల్సిందే!
సంక్రాంతి కానుకగా విడుదలైన హీరో మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా కమర్షియల్ గా ఆడలేదు. ఇది కూడా ఆమె కెరీర్ లో మరో డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే నిధి ప్యాకెట్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ఉంది. అదే హరి హర వీరమల్లు. పవన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో హరి హర వీరమల్లు తెరకెక్కుతుంది. ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు.
హరి హర వీరమల్లు పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ మూవీలోని నిధి లుక్ ఆకట్టుకుంది. అనుకోని కారణాలతో హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ ఆలస్యం అవుతుంది. 2023 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలయ్యే సూచనలు కలవు. ఈ మూవీ సక్సెస్ టాక్ తెచ్చుకుంటే నిధి కెరీర్ జోరందుకున్నట్లే. హరి హర వీరమల్లుతో పాటు మరో తమిళ చిత్రం చేస్తున్నారు. కాగా కెరీర్ సంగతి ఎలా ఉన్నా ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ… ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు.