President Election 2022: రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. 16వ రాష్ట్రపతి ఎన్నిక కోసం ప్రభుత్వం ముందుకు రావడంతో కసరత్తు ప్రారంభం అయింది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ నిర్వహించనున్నారు. అదే నెల 21న కౌంటింగ్ పూర్తి చేసి 24న రాష్ట్రపతి ఎన్నిక కార్యక్రమం జరపనున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఎన్నికకు సంబంధించిన ప్రకటన వెలువరించింది. ఈనెల 15న నోటిఫికేషన్ విడుదల కానుంది. 29వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న స్క్రూటినీ జరుగుతుంది. జులై 2 నామినేషన్ల ఉపసంహరణకు సమయం కేటాయించారు. ప్రస్తుత రాష్ట్రపతి పదవీ కాలం జులై 25తో ముగియనుంది. దీంతో అప్పటిలోగా రాష్ట్రపతి ఎన్నిక పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
లోక్ సభలోని 543 మంది, రాజ్యసభలోని 233 మంది తో కలిపి మొత్తం 776 మంది సభ్యుల ఓటింగ్ ఉంటుంది. అలాగే 4120 మంది ఎమ్మెల్యేలకు కూడా ఓటు వేసే అధికారం ఉంటుంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ ఎక్కువగా ఉండనుంది. దీంతో ఓటింగ్ రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరగనుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం ఎలక్టోరల్ కాలేజీలో 10,86,431 ఓట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలియజేస్తోంది. ఇందులో 5,36,640 ఓట్లు పోలైన వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నుకోబడతారు. ప్రతిపక్షాలు సైతం తమ అభ్యర్థిని నిలబెడతామని చెబుతున్న నేపథ్యంలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు.
Also Read: TRS Drinkers Party: టీఆర్ఎస్ పేరు మార్చిన కాంగ్రెస్, వైఎస్సార్ టీపీ
పార్లమెంట్ సభ్యుల సంఖ్య 776 కావడంతో ఎంపీల ఓటు విలువ 708గా లెక్క కట్టారు. అదే విధంగా రాష్ట్రాల్లో శాసనసభ్యుల ఓటు విలువ కూడా లెక్కలోకి తీసుకుంటారు. అందుకే వారికి కూడా ఓటు విలువ ఉంటుంది. ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి వారి ఓటు విలువ నిర్ణయించబడుతుంది. ఉత్తరప్రదేశ్ లో ఎమ్మెల్యేల సంఖ్య 403 కాగా వారి ఓటు విలువ ఎక్కువగా ఉంటుంది. అదే మన రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో మన ఓటు విలువ తక్కువగా ఉంటుంది. రాష్ట్రాల వారీగా ఎమ్మెల్యేల ఓటు విలువ 208గా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ప్రతిపక్షాలు కూడా తమ అభ్యర్థిని నిలబెడతామని చెబుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా? లేక ఓటింగ్ నిర్వహించాల్సి వస్తుందో తెలియడం లేదు. బీజేపీ మాత్రం ఏకగ్రీవం కోసమే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందరికి ఆమోదయోగ్యమైన వ్యక్తినే రాష్ట్రపతిగా నిలబెట్టేందుకు నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇదే జరిగితే ఎన్నిక లేకుండా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది. కానీ ప్రతిపక్షాలు మాట వినకపోతే మాత్రం పోటీ అనివార్యమని తెలుస్తోంది. మొత్తానికి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
ప్రతిపక్షాలు మాత్రం అన్నా హజారేను తీసుకురావాలని చూస్తున్నాయి. ఇందుకోసం ప్రణాళికలు కూడా రచిస్తున్నాయి. బీజేపీ మాత్రం అయితే రాంనాథ్ కోవింద్ లేదంటే వెంకయ్యనాయుడును నిలబెట్టాలని భావిస్తోంది. దీంతో ఎవరి పంతం నెగ్గుతుందో అంతుచిక్కడం లేదు. రాష్ట్రపతి ఎన్నిక రసకందాయంలో పడనుంది. అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఏకగ్రీవం చేసే సంప్రదాయానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అందుకే ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఎవరెవరిని రంగంలోకి దింపుతాయో అనుమానంగానే ఉంది.
వెంకయ్య నాయుడు దేశవ్యాప్తంగా తిరిగిన నేతగా గుర్తింపు ఉంది. దీంతో ఆయన అభ్యర్థిత్వంపైనే బీజేపీ ఎక్కువగా మొగ్గు చూపుతోంది. ఒకవేళ వెంకయ్యను జనం ఒప్పుకోకపోతే రాంనాథ్ కోవింద్ తోనే మళ్లీ నామినేషన్ వేయించాలనే ఉద్దేశంతో బీజేపీ ఆలోచిస్తోంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం తమ అభ్యర్థి గాంధీయ వాది అయిన అన్నా హజారేను పోటీలో నిలపాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నిక వ్వవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. నామినేషన్ల చివరి వరకు ఎవరు రంగంలో ఉంటారో తెలియడం లేదు. దీంతో రాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది.
Also Read:Nayanathara wedding: వైరల్ గా నయనతార-విఘ్నేష్ శివన్ ల పెళ్లి.. ఏర్పాట్లు చూస్తే దిమ్మదిరగాల్సిందే!