ప్రకాశంలో వైసిపి ఆకర్ష్ …. టిడిపి ఇక ఖాళీ!

కొంత కాలంగా మూడు రాజధానులు, శాసన మండలి రద్దు వంటి అంశాలపై ద్రుష్టి సారిస్తున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగనా మోహన్ రెడ్డి తిరిగి ప్రతిపక్ష నేతలను ఆకర్షించడం పట్ల దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తున్నది. ఒకొక్క జిల్లాల్లో ఆ పార్టీ బలాన్ని హరించే ప్రయత్నాలకు తిరిగి శ్రీకారం చుట్టారు. మొదటగా ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి పట్టు లేకుండా చేయడం కోసం సిద్దపడిన్నట్లు చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో టిడిపికి ఉన్న నలుగురు ఎమ్యెల్యేలలో టిడిపిలో అత్యంత బలమైన […]

Written By: Neelambaram, Updated On : May 22, 2020 5:47 pm
Follow us on

కొంత కాలంగా మూడు రాజధానులు, శాసన మండలి రద్దు వంటి అంశాలపై ద్రుష్టి సారిస్తున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగనా మోహన్ రెడ్డి తిరిగి ప్రతిపక్ష నేతలను ఆకర్షించడం పట్ల దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తున్నది. ఒకొక్క జిల్లాల్లో ఆ పార్టీ బలాన్ని హరించే ప్రయత్నాలకు తిరిగి శ్రీకారం చుట్టారు. మొదటగా ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి పట్టు లేకుండా చేయడం కోసం సిద్దపడిన్నట్లు చెబుతున్నారు.

ప్రకాశం జిల్లాలో టిడిపికి ఉన్న నలుగురు ఎమ్యెల్యేలలో టిడిపిలో అత్యంత బలమైన నేతగా పేరొందిన, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన కారణం బలరామకృష్ణ మూర్తి ఇప్పటికే వైసిపి చెంత చేరారు. ఇక మిగిలిన ముగ్గురిని కూడా టిడిపికి దూరం చేయడం కోసం ముహర్తం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 30న ఆ విధంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణం చేసి మే 30 తేదీ నాటికి ఏడాది అవుతుంది. అదే రోజు నాటికి ప్రకాశం జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలనూ వైసిపిలోకి చేర్చుకొంటే జిల్లాలో టిడిపి మొత్తం ఖాళీ అవుతుంది అని వైసిపి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో టిడిపికి 23 స్థానాలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులోనూ ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్‌ అయ్యారు.

మరో ముగ్గురిని వైసిపి తీర్థం పుచ్చుకునేలా చేస్తే శాసన సభలో టిడిపికి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. అందులో భాగంగానే జిల్లాలోని టిడిపి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు గాలం వేస్తూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందుబాటులో, టచ్‌లో ఉన్న టిడిపి నేతలతో మంతనాలు మొదలుపెట్టినట్లు చెబుతున్నారు.

వైసిపిలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే నిబంధన ఉండటంతో టిడిపి ఎమ్యెల్యేలు ప్రధానంగా వెనుకడుగు వేస్తున్నారు. అందులో చేరినా మంత్రి పదవులు వచ్చే అవకాశం లేదు గదా అంటూ పెదవి విరుస్తున్నారు. అయితే టిడిపిలో కొనసాగితే వ్యాపార పరంగా, పోలీసుల పరంగా వేధింపులకు గురికావలసి వస్తుందని భయపడవలసి వస్తున్నది. కేవలం రక్షణ కోసమే అధికార పక్షంలో చేరుతున్నట్లు స్పష్టం అవుతున్నది.

రాజకీయ ప్రత్యర్థులనే కాకుండా సొంతపార్టీలో సహితం తన మాట వినని వారిపై దూడకుడుగా వ్యవహరిస్తూ అనేక హింసాయుత సంఘటనలకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న కారణం బలరామకృష్ణ మూర్తి వంటివారు సహితం వైసిపి ప్రభుత్వంలో దౌర్జన్యాలను ఎదుర్కొనలేక దాసోహం కావలసి రావడం గమనార్హం.