శ్రీశైలంలో నిధుల స్వాహాలో అధికార పార్టీ నేత హస్తం!

ఒక వంక తిరుమల శ్రీవారి ఆస్తుల వేలంపై వివాదం చెలరేగుతున్న సమయంలో మరో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఉద్యోగులే అక్రమాలకు పాల్పడి నిధుల స్వాహా ఉదంతం తెరపైకి రావడంతో జగన్ పాలనలో హిందూ దేవాలయాల పాలన తీరుతెన్నుల పట్ల అనుమానాలు చెలరేగుతున్నాయి. సుమారు నాలుగేళ్లుగా అక్రమాలు జరుగుతూ ఉండగా, రెండు నెలలుగా ఇఓ రామారావు జరిపిన విచారణలో ఒకొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. సుమారు రూ 3 కోట్ల మేరకు నిధులను కైవసం చేసిన్నట్లు ప్రాధమిక అంచనాకు వచ్చారు. […]

Written By: Neelambaram, Updated On : May 26, 2020 12:27 pm
Follow us on


ఒక వంక తిరుమల శ్రీవారి ఆస్తుల వేలంపై వివాదం చెలరేగుతున్న సమయంలో మరో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఉద్యోగులే అక్రమాలకు పాల్పడి నిధుల స్వాహా ఉదంతం తెరపైకి రావడంతో జగన్ పాలనలో హిందూ దేవాలయాల పాలన తీరుతెన్నుల పట్ల అనుమానాలు చెలరేగుతున్నాయి.

సుమారు నాలుగేళ్లుగా అక్రమాలు జరుగుతూ ఉండగా, రెండు నెలలుగా ఇఓ రామారావు జరిపిన విచారణలో ఒకొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. సుమారు రూ 3 కోట్ల మేరకు నిధులను కైవసం చేసిన్నట్లు ప్రాధమిక అంచనాకు వచ్చారు. ఉద్యోగులే ఆలయంలో సాఫ్ట్‌వేర్ మార్చి ఈ దురగాతానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు.

శ్రీఘ్ర దర్శనాలు, అభిషేకం టికెట్లు, కంకణాలు, మహా మంగళహారతి టికెట్ల ద్వారా స్వామివారికి వచ్చే ఆదాయంలో ఆలయ సిబ్బంది చేతివాటం చూపించారు. రూ. 150 శ్రీఘ్ర దర్శనంలో కోటి రూపాయలు, రూ 1,500 అభిషేకం టికెట్లలో రూ. 50 లక్షలను, అకామిడేషన్ (వసతి గృహం)లో మరో రూ 50 లక్షలను కాజేశారని వెల్లడైనది.

అదే విధంగా, ఆలయ పరిధిలోని టోల్ గేట్, పెట్రోల్ బంకుల నిర్వహణలో మరో రూ.40 లక్షలు, రూ 500 టిక్కెట్లు, కంకణాలు, మహా మంగళహారతి టికెట్లలో మరో రూ 50 లక్షలు దుర్వినియోగం జరిగిందని చెబుతున్నారు.

అయితే ఈ కుంభకోణంలో కీలకమైన ఉద్యోగులను తప్పించి టికెట్ కౌంటర్లలోని కాంట్రాక్టు ఉద్యోగులపైకి నెట్టివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తున్నది. రాజకీయ జోక్యంతోనే ఈ విధంగా ముఖ్యులను తప్పిస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి.

స్థానిక వైసిపి ప్రముఖుడికి సన్నిహితంగా ఉండే ఇద్దరు కీలక ఉద్యోగులను ఈ కేసు నుండి తప్పించడం ఈ సందర్భంగా పలు అనుమానాలకు దారితీస్తుంది. ఆ ఇద్దరిలో ఒకరు స్థానిక వైసిపి ప్రముఖుడికి సమీప బంధువని చెబుతున్నారు.

శాఖాపరమైన విచారణ జరపడం ద్వారా అసలు నిందితులను పట్టుకొనే అవకాశం ఉండబోదని, సిఐడి విచారణ జరపవలసిందే అని ఉద్యోగ సంఘాలలో పలువురు కోరుతున్నారు.