Jagananna Rice Bags: ఆంధ్రప్రదేశ్ లో గతంలో రేషన్ లబ్ధిదారులకు రేషన్ సరుకులు ఇంటికే అందజేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. బియ్యం సంచితో సహా ప్రభుత్వమే అందజేసింది. దీంతో లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన పని లేకుండా పోయింది. దీనికి గాను ఒక్కో సంచికి రూ. 38 దాకా ఖర్చయిందని తెలుస్తోంది. దీంతో ఏపీలో రేషన్ లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమైంది. రేషన్ షాపుల్లో బియ్యం తీసుకుంటే సుమారు 100 గ్రాముల వరకు తూకాల్లో తేడా వస్తుందని గ్రహించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఇంటింటికి రేషన్ సరుకులు పంచేందుకు లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా రేషన్ బియ్యం సంచులను పంపిణీ చేసేవారు. సంచులపైన జగన్, ఆయన తండ్రి వైఎస్ ఫొటోలను ముద్రించేవారు. దీనికి గాను పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యేదని తెలుస్తోంది. దీంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయి. రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోవడంతో వృద్ధులకు ఎంతో ఆసరాగా ఉండేది.
కానీ ఇప్పుడు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదే జగనన్న సంచుల విషయం. ఇవి కేరళలోని గురువాయూర్ సమీపంలోని ఓ దుకాణంలో వేలాడదీసి కనిపించాయట. దీంతో అక్కడికి వెళ్లిన ఏపీ వాసులు వాటిని వీడియోలు తీసి నెట్లో పెట్టారు దీంతో ఈ విషయం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ ఇదైపోతోంది. అసలు జరిగిన విషయం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు.
Also Read: Jagan: ఏపీలో ఏకతాటిపైకి విపక్షాలు.. జగన్ లో పెరుగుతున్న భయం?
గతంలో కూడా తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటింటికి పంపిణీ చేసిన గ్రైండర్లు ఏపీలో అమ్మకానికి రావడంతో దానిపై పెద్ద గందరగోళమే రేగింది. దీంతో ఇప్పుడు జగనన్న సంచులు కేరళలో ప్రత్యక్షం కావడంతో కూడా అందరిలో అనుమానాలు వస్తున్నాయి. అసలు అవి అక్కడికి ఎందుకు వెళ్లాయి. ఇందులో అధికారుల పాత్ర ఉందా? లేక ప్రజాప్రతినిధుల మోసం ఏదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఏర్పడింది.
Also Read: AP Govt: కొత్త రూల్స్ తో థియేటర్లకు సినిమా చూపించబోతున్న ఏపీ సర్కార్..!