RRR: ‘పుష్ప’ సినిమా రిజల్ట్ చూశాక, ఇప్పుడు అందరికీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎలా ఉండబోతుంది ? అనే ఆసక్తి రెట్టింపు అయింది. పైకి ఎన్ని చెప్పుకున్నా.. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి చేస్తున్న సినిమా ఇది. ఏ హీరో ముందు ఏ హీరో కొంచెం తగ్గినా ఆ హీరో ఫ్యాన్స్ లో ఆగ్రహావేశాలు ఒక్కసారిగా ఎగిసిపడతాయి. ఇప్పుడు బయ్యర్లలో ఇదే టెన్షన్ మొదలైంది. థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ గొడవలు పడితే ఏమిటి పరిస్థితి ?
పుష్ప సినిమా చూసి.. నలభై అడుగుల బన్నీ కటౌట్ ను చింపేశారు. ఫ్యాన్స్ లో ఈ ఆవేశం మంచిది కాదు. అయినా ఫ్యాన్స్ ఎమోషన్స్ ను కంట్రోల్ చేయడం కష్టం. అందుకే ఇప్పుడు అందరి చూపు ఆర్ఆర్ఆర్ మీదకు వెళ్ళింది. రాజమౌళి ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. పాత్రలను బట్టే.. హీరోల పై సీన్స్ ను తీశాను అని. అయితే, పాత్రల పరంగా చూసుకుంటే.. ఎన్టీఆర్ పాత్ర కీలకంగా ఉండబోతుంది.
మొత్తానికి ఎన్టీఆర్ మీద రాజమౌళికి ఉన్న ప్రేమే.. చరణ్ కి మైనస్ అవ్వనుంది. ఎన్టీఆర్ అంటే రాజమౌళికి ప్రత్యేక అభిమానం.. ఈ విషయం రాజమౌళినే ఎన్నో సందర్భాల్లో వ్యక్తపరిచాడు. అందుకే, ఎన్టీఆర్ సీన్స్ అన్నీ అద్భుతంగా వచ్చేలా ప్లాన్ చేశాడు. పైగా కథలో ఎన్టీఆర్ పులి అంటూ, చరణ్ వేటగాడు అంటూ సినిమా మొదలు పెట్టాడు.
Also Read: Kajal: ఆ విషయంలో ‘సమంత’ను ఫాలో అవుతున్న కాజల్ !
ఎప్పుడైనా ప్రజలకు మంచి చేసే విప్లవకారుడే హీరో అవుతాడు. ఇక ఎంత గొప్పవాడు అయినా విలన్ల దగ్గర పని చేసే మరో హీరో ఎప్పటికీ సెకండ్ హీరోగానే మిగిలిపోతాడు. కరెక్ట్ గా ఆర్ఆర్ఆర్ లో కూడా ఇదే జరగనుంది. మరి ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం కారణంగా రాజమౌళి మాత్రం ఈ అంశాన్ని సున్నితంగా వివరించాడు.
మొత్తమ్మీద ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానం, చరణ్ హీరోయిజాన్ని తగ్గించబోతుంది అన్నమాట. ఈ సినిమాలో ప్రధాన హైలెట్స్ లో ఎన్టీఆర్ డైలాగ్స్ మెయిన్ హైలెట్ అవనున్నాయి. తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు కొమరం భీమ్ గొప్ప తనాన్ని ధైర్యాన్ని ఎలివేట్ చేయనున్నాయి.
Also Read: Unstoppable: చిరు, బాలయ్య, మోహన్బాబులపై గాసిప్స్ బాగా మాట్లాడుకుంటాం- రాజమౌళి