Maa Elections: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కాకపుట్టిస్తున్నాయి. సినీ ఇండస్ట్రీనే కాదు.. రాజకీయాలను ఇన్ వాల్వ్ చేసి విమర్శలు చేసుకుంటున్నారు. ప్రధాన పోటీదారులు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మంచు ఎన్నికల కోసం నమోదు చేసుకున్న మా సభ్యుల మద్దతును సేకరించి ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ ఎన్నికలు ఇరువైపుల వ్యాఖ్యలతో ఒక రాజకీయ ఎన్నికను తలపిస్తున్నాయి.

హీరో మంచు విష్ణుకు ఏపీ అధికార పార్టీ మద్దతు ఉందన్న ప్రచారం మొదలైంది. ఎందుకంటే స్వయంగా మంచు విష్ణు సీఎం జగన్ కు బావమరిది వరుస అవుతాడు. ఇక మెగా క్యాంప్ ప్రకాష్ రాజ్‌కు మద్దతు ఇస్తుందన్న ప్రచారం ఉంది. నాగబాబు ప్రత్యేకంగా ప్రకాష్ రాజ్ వెంట నిలబడ్డాడు. దీంతో ‘మా’ ఎన్నికలు టాలీవుడ్ పరిశ్రమ, వైసీపీ ప్రభుత్వం మధ్య ఫైట్ లా మారింది. ఇరు వర్గాలు తమకు ఆ మద్దతు ఉందంటూ ఏకపక్షంగా ప్రకటనలు చేస్తున్నాయి.
ఈ పుకార్లు టాలీవుడ్ ను షేక్ చేసేలా ఉన్నాయి. భారీ హైప్ ను సంతరించుకున్నాయి. మా ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం ప్రమేయం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రకాష్ రాజ్ సైతం ‘మా’ ఎన్నికల్లో వైఎస్ జగన్, సీఎం కేసీఆర్ లను లాగడం ఏంటని ప్రశ్నించారు. అయినా మా సభ్యులు సీఎంల మద్దతు ఉందంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ ఊహాగానాలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఏపీ మంత్రి పేర్ని నాని ఒక వీడియోను విడుదల చేసారు. సీఎం జగన్ ఎవరికి సపోర్ట్ నో తేల్చిపారేశారు. ఏపీ ప్రభుత్వం, వైసీపీకి మా ఎన్నికలలో ఎటువంటి హస్తం లేదని మంత్రి పేర్ని నాని తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో తెలుగులో ట్వీట్ చేశాడు.దీంతో ‘మా’ ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వం మద్దతు తనకుందని ఆశపడ్డ మంచు విష్ణు ఆశలపై ఈ ప్రకటన నీళ్లు చల్లినట్టైంది.
ఏదేమైనా రాజకీయంగా ఏదో పుంజుకుంటుందని.. అది మంచు విష్ణు లాభిస్తుందని అనుకున్నారు. కానీ ఏపీ సర్కార్ చేసిన ఈ ప్రకటన భారీ నష్టాన్ని మిగిల్చిందని తెలుస్తోంది.
చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి జరుగుతున్నటువంటి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలతో @ysjagan గారికి కాని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కాని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాని ఎటువంటి సంబంధం లేదు.
— Perni Nani (@perni_nani) October 4, 2021