బద్వేల్ వేదికగా రాజకీయాలు మారిపోతున్నాయి. పోటీలో వైసీపీ, బీజేపీ ఉన్నాయి. దీంతో ఎన్నిక ఏకపక్షమే అనే వాదన వినిపిస్తున్నా గట్టి పోటీ ఇస్తామని బీజేపీ చెబుతోంది. కుటుంబ పాలనకు వ్యతిరేకం కావడంతోనే పోటీలో ఉన్నట్లు బీజేపీ ప్రకటిస్తోంది. ముందుగా పోటీలో ఉండాలని అనుకున్న జనసేన, టీడీపీ పోటీ నుంచి తప్పుకున్నాయి. సంప్రదాయ పద్దతులకు విలువ ఇచ్చే పోటీ నుంచి దూరం జరిగినట్లు పవన్ కల్యాణ్ ప్రకటించింది. టీడీపీ మాత్రం పొలిట్ బ్యూరో సమావేశంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించింది. దీంతో బీజేపీ మాత్రమే పోటీలో నిలిచింది. దీంతో ఇక్కడ ద్విముఖ పోరు కొనసాగనుంది.
జనసేన మద్దతుతో బద్వేల్ లో పోటీ చేయాలని బీజేపీ భావించినా చివరి క్షణంలో పవన్ కల్యాణ్ చేయి ఇవ్వడంతో బీజేపీ ఒంటరైపోయింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా ప్రచారంలో పాల్గొనరు. దీంతో బద్వేల్ లో బీజేపీ ఏ మేరకు ప్రభావం చూపిస్తుందని అందరిలో ఉత్కంఠ నెలకొంది. టీడీపీ తప్పుకోవడంతో బీజేపీ కూడా తన నేతలతో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
బద్వేల్ ఉప ఎన్నికలో బీజేపీ రంగంలో ఉన్నా పవన్ కల్యాణ్ మాత్రం మద్దతు ఇవ్వరనే విషయం తెలుస్తోంది. ధీంతో బీజేపీ వైసీపీతో పోటీలో ఉన్నా ప్రభావం చూపుతుందా అనేదే ప్రశ్న. ఈ నేపథ్యంలో జనసేన మద్దతు బీజేపీ దక్కదని తెలియడంతో బీజేపీ ఆలోచనలో పడినట్లు కనిపిస్తోంది. అయినా పోటీలో ఉండడంతో ప్రచారం చేయడం పైనే దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బద్వేల్ ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థిగా సుధ తన ప్రచారం కొనసాగిస్తున్నారు. సానుభూతి ఓట్లతోనే ఆమె గట్టెక్కాలని బావిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ ఏ ఆయుధం తీసుకుంటుందో తెలియడం లేదు. కానీ బద్వేల్ ఉప ఎన్నికలో గెలుపు మాత్రం ఏక పక్షమే అని అందరు చర్చించుకుంటున్నారు.
