రఘురామపై అనర్హత వేటు వేయించేందుకు?

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజుపై అనర్హత వేటు వేసేందుకు అధికార వైసీపీ ప్రయత్నిస్తోంది. వైసీపీ టికెట్ పై గెలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. వైసీపీ చీఫ్ విప్ భరత్ మాట్లాడుతూ రఘురామ పార్టీ వ్యతిరేక విధానాలతో ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామపై […]

Written By: Srinivas, Updated On : June 11, 2021 7:10 pm
Follow us on

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజుపై అనర్హత వేటు వేసేందుకు అధికార వైసీపీ ప్రయత్నిస్తోంది. వైసీపీ టికెట్ పై గెలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. వైసీపీ చీఫ్ విప్ భరత్ మాట్లాడుతూ రఘురామ పార్టీ వ్యతిరేక విధానాలతో ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.

ాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామపై తక్షణమే అనర్హత వేటు వేయాలని కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత రఘురామ పథకం ప్రకారం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చారు. రోజురోజుకు ఆయన విమర్శలు శృతిమించడంతోనే రాజద్రోహం కేసు నమోదు చేయాల్సి వచ్చిందని వివరించారు.

బెయిల్ పై విడుదలైన తర్వాత ఢిల్లీ వేదికగా కేంద్ర పెద్దలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని దేశంలోని ముఖ్యమంత్రులకు, గవర్నర్లకు లేఖలు రాస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాని చూస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేసి ప్రభుత్వానికి రక్షణ కల్పించాలని కోరారు.

రాజద్రోహం చట్టంపై పార్లమెంట్ లో ప్రస్తావిస్తానని, మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రులందరినీ రఘురామ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టువదలని విక్రమార్కుడిలా వైసీపీ ప్రభుత్వం తనపై వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నరఘురామపై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తుండడం గమనార్హం.