కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకే పరిమితం అయిన హీరోయిన్ తాప్సీ పన్ను, ఆ తరువాత వైవిధ్యమైన చిత్రాలను చేసి తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ‘హసీన్ దిల్ రూబా’ అనే మరో సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నెట్ ఫ్లిక్స్ లో జులై 2న ఈ చిత్రాన్ని గ్రాండ్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కి మంచి స్పందన వచ్చింది.
దాంతో తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ లో విక్రాంత్ మాస్సేని పెళ్లి చేసుకున్న తాప్సీ, ఆ తరువాత హర్షవర్ధన్ రాణేతో శారీరక సంబంధం పెట్టుకోవడం మొదలైన కథా మలుపుతో ఈ చిత్రం ఎన్ని మలుపులు తిరిగింది అనేది మెయిన్ పాయింట్. అయితే, ఈ క్రమంలో విక్రాంత్ మాస్సే చనిపోతాడు. ఆ మరణానికి తాప్సి వేరో వ్యక్తితో పెట్టున్న ఎఫైరే కారణమని ఆమెను పోలీసులు అనుమానిస్తారు.
ఇక ట్రైలర్ లో పోలీసులు తాప్సిని విచారించిన షాట్స్, అదే సమయంలో ఆమె ప్రియుడు మిస్ అవడంతో మొత్తానికి ఈ కథ ఆసక్తికరంగా మారింది. ఇద్దరు వ్యక్తులతో తాప్సి ప్రేమ కథ ఎలా సాగింది ? ఇద్దరు హీరోలతో రొమాంటిక్ సన్నివేశాల్లో తాప్సి ఎలా నటించింది ?లాంటి అంశాలు ట్రైలర్ ను ఆకర్షణీయంగా మార్చాయి. ముఖ్యంగా పడక గది సీన్స్ తో పాటు లిప్ లాక్ సీన్స్ లలో కూడా తాప్సీ అదరగొట్టింది.
పైగా హాట్ హాట్ విషయంలో తాప్సి మునుపెన్నడూ కనిపించనంత గ్లామరస్ గా కనిపించి మెప్పించింది. దీనికితోడు అమిత్ త్రివేది నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు మాజీ కోడలు కనికా థిల్లాన్ కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించడం విశేషం. ఇక ఈ చిత్రానికి వినీల్ మాథ్యూ దర్శకత్వం వహించారు. టీ సిరీస్ ఫిలిమ్స్ మరియు కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని రూపొందింది.