బ్యాంక్‌ డీటెయిల్స్ చెప్తే సంక‌నాకి పోతారు.. బ్ర‌హ్మానందం వైర‌ల్ వీడియో!

‘సార్‌.. మీరు ల‌క్కీ లాటరీ గెల్చుకున్నారు’ అంటూ ఓ మెసేజ్‌! ‘మేడమ్.. మీ అకౌంట్ ప్రాబ్లంలో ఉంది’అంటూ ఓ ఫోన్ కాల్! ఇలా.. ఎవ‌రో అగంత‌కులు ఫోన్ చేసి, మెసేజ్ చేసి మాట‌ల్లో పెడ‌తారు.. ఏ మాత్రం సందేహం రాకుండా ఏటీఎం పిన్ నంబ‌రు, బ్యాంకు ఖాతా డీటెయిల్స్‌, వ‌గైరా వ‌గైరా.. అన్నీ లాగేస్తారు. ఆ త‌ర్వాత నెత్తిన శ‌ఠ‌గోపం పెట్టేస్తారు. చ‌దువు రాని అమాయ‌కుల నుంచి.. ఉన్న‌త చ‌దువులు వెల‌గ‌బెట్టిన విద్యావంతుల వ‌ర‌కూ ఈ బాధితుల […]

Written By: Bhaskar, Updated On : February 13, 2021 3:50 pm
Follow us on


‘సార్‌.. మీరు ల‌క్కీ లాటరీ గెల్చుకున్నారు’ అంటూ ఓ మెసేజ్‌!

‘మేడమ్.. మీ అకౌంట్ ప్రాబ్లంలో ఉంది’అంటూ ఓ ఫోన్ కాల్!
ఇలా.. ఎవ‌రో అగంత‌కులు ఫోన్ చేసి, మెసేజ్ చేసి మాట‌ల్లో పెడ‌తారు.. ఏ మాత్రం సందేహం రాకుండా ఏటీఎం పిన్ నంబ‌రు, బ్యాంకు ఖాతా డీటెయిల్స్‌, వ‌గైరా వ‌గైరా.. అన్నీ లాగేస్తారు. ఆ త‌ర్వాత నెత్తిన శ‌ఠ‌గోపం పెట్టేస్తారు. చ‌దువు రాని అమాయ‌కుల నుంచి.. ఉన్న‌త చ‌దువులు వెల‌గ‌బెట్టిన విద్యావంతుల వ‌ర‌కూ ఈ బాధితుల జాబితాలో ఉన్నారు. ఇంకా.. లిస్టులోకి ఎక్కుతూనే ఉన్నారు. ఆ తీవ్ర‌త ఎంత‌గా ఉందో మ‌న బ్ర‌హ్మానందం చేసిన వీడియో చూస్తేగానీ అర్థంకాదు!

Also Read: ‘ఉప్పెన‌’ కోసం ఇంత రిస్కా..? ముందే తెలిస్తే వ‌ద్ద‌నేవాణ్నిః నాగ‌బాబు

నిజానికి ఇంట‌ర్నెట్ వినియోగం పెద్ద‌గా లేని రోజుల్లో.. ఆన్లైన్ మోసాల గురించి స‌రిగా అవ‌గాహ‌న లేని కాలంలో ఇలాంటి మోసాలు జ‌రిగాయంటే అర్థం చేసుకోవ‌చ్చు.. కానీ.. ఈ రోజుల్లో కూడా ఆన్ లైన్ మోసాల‌కు గుర‌వుతున్న వారి జాబితా చాంతాడంత ఉండ‌డం ఆలోచించాల్సిన విష‌య‌మే. ఇక్క‌డ‌, మోస‌గాళ్లు తెలివైనోళ్లా? మోసపోయేవాళ్లు అత్యాశకు పోతున్నారా? అనేది తెలియ‌ట్లేదుగానీ.. ఎక్క‌డో కూర్చొని బ్యాంక్ అకౌంట్ కు బొక్క‌పెట్టేస్తున్న కేటుగాళ్లు.. మొత్తం లాగేస్తున్నారు.

దీంతో.. బ్యాంక్ మోసాలపై క‌ల్పిస్తున్న అవ‌గాహ‌న స‌రిపోలేద‌ని, రెండో విడ‌త కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు బ్యాంకు అధికారులు, పోలీసులు. ఇప్ప‌టికే.. ప‌లుమార్లు ఈ బ్యాంకు మోసాల‌పై అవగాహ‌న క‌ల్పించేందుకు సైబర్ క్రైమ్ అధికారులు కొంత‌మంది ప్ర‌ముఖుల‌తో అవ‌గాహ‌న వీడియోలు చేయించారు. అయిన‌ప్ప‌టికీ.. జ‌నాలు వెళ్లి మోస‌గాళ్ల వ‌ల‌లో చిక్కుకుంటూనే ఉన్నారు. దీంతో సినీ ఫ‌క్కీలో ట్రై చేస్తే ఏమైనా వ‌ర్క‌వుట్ అవుతుందేమోన‌ని మ‌ళ్లీ ప్ర‌య‌త్నించారు అధికారులు.

Also Read: ‘ఉప్పెన‌’ జోరు.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే..?

ఈ సారి మ‌న బ్ర‌హ్మీని రంగంలోకి దింపారు. ఈ వీడియోలో బ్యాంకు అధికారుల‌తోపాటు పోలీసులు కూడా క‌నిపించారు. వీడియో మొద‌ట్లో బ్యాంకు అధికారులు అంతా నిల‌బ‌డి.. ఓటీపీ, సీవీవీ వంటి నెంబర్లు మేం అడగం.. మేం అడగం అని చెప్పారు. ఆ త‌ర్వాత పోలీసులు కూడా ఇదే మాట చెప్పారు. వారి త‌ర్వాత మ‌న బ్ర‌హ్మీ ఎంట‌ర్ అయ్యారు.

‘‘ఏమండీ.. మేమేం డిటైల్స్ అడగమని బ్యాంక్ వాళ్లు చెబుతున్నారు. పోలీసులు కూడా ఏ డిటైల్స్ ఇవ్వ‌కండ‌ని చెబుతున్నారు. అయినా స‌రే ముక్కు, మొహం తెలియని వాళ్లు అడిగితే మాత్రం డిటైల్స్ ట‌ప‌టపా ఇచ్చేస్తుంటారు. కొంచెం ఆలోచించండి. త‌రువాత ఎన్ని ఇబ్బందులు ప‌డాలో ఆలోచించండి. చివ‌ర‌కు బ్ర‌హ్మానందం వ‌చ్చి చెప్పాల్సి వ‌స్తుంది’’ అని అన్నారు మన బ్రహ్మీ. ఈ వీడియో మధ్యలో బ్రహ్మానందం ఫన్నీ ఎక్స్‌ప్రెష‌న్ల‌ను కూడా యూజ్ చేశారు. మరి, ఇకనైనా జనాలు మోసగాళ్ల బావిలో దూకడం మానేస్తారో..?!

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్