https://oktelugu.com/

నేటి నుంచే ఏపీలో పెన్షన్ల పంపిణీ!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ పెన్షన్ కానుకను నేటి నుంచే (మే 1వ తేదీ) లబ్దిదారులకు అందిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 2,37,615 మంది వాలంటీర్లతో పెన్షన్ సొమ్మును పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 58.22 లక్షల మందికి పెన్షన్లు అందించనున్నట్టు పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ పంపిణీ కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.1421.20 కోట్లను విడుదల చేసింది. అయితే ఈ సారి పెన్షన్ పంపిణీ విధానంలో మార్పులు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 1, 2020 / 07:07 AM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ పెన్షన్ కానుకను నేటి నుంచే (మే 1వ తేదీ) లబ్దిదారులకు అందిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 2,37,615 మంది వాలంటీర్లతో పెన్షన్ సొమ్మును పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.

    రాష్ట్రవ్యాప్తంగా 58.22 లక్షల మందికి పెన్షన్లు అందించనున్నట్టు పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ పంపిణీ కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.1421.20 కోట్లను విడుదల చేసింది.
    అయితే ఈ సారి పెన్షన్ పంపిణీ విధానంలో మార్పులు చేశారు. ఇప్పటి వరకు వాలంటీర్లు పెన్షనర్ల ఇంటికి వెళ్లి బయోమెట్రిక్ తీసుకొని పెన్షన్ సొమ్మును అందజేసేవారు. ఇప్పుడు బయోమెట్రిక్ బదులు పెన్షనర్ల ఫోటోల జియో ట్యాగింగ్‌ ను అమలు చేయనున్నారు. లాక్‌ డౌన్‌ తో ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి పోర్టబిలిటీ ద్వారా పెన్షన్లు అందజేయనున్నారు. హెచ్ఐవి, డయాలసిస్ పేషంట్లకు డిబిటి విధానంలో పెన్షన్ సొమ్మును జమ చేయనున్నారు. పింఛన్ తీసుకున్నట్లు లబ్ధిదారుడి ఫోటోను మొబైల్‌ లో తీసుకొని జియో ట్యాగ్ చేయనున్నారు. ఏపీలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. వేలిముద్రల ద్వారా కూడా కరోనా వ్యాపించే ప్రభావం ఉండడంతో జగన్ సర్కార్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జియో ట్యాగింగ్ ను అమలు చేస్తుంది.